Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?
Aamir Khan Marriage : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం.

Aamir Khan To Marry Gauri Spratt In Mumbai : బాలీవుడ్ లెజెండ్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా? దీనికి అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బీటౌన్‌లో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.
డేట్ ఫిక్స్
ముంబైలోని తన నివాసంలో జులై 5న ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆమిర్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభించారని బీటౌన్ టాక్. అతిథుల జాబితా అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా... సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఈ వేడుకకు హాజరు కావొచ్చని సమాచారం. దీనిపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. గతేడాది తన 60వ బర్త్ డే సందర్భంగా తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన మీడియాకు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికే ఏడాదిన్నర నుంచి తాము డేటింగ్‌లో ఉన్నట్లు రివీల్ చేశారు. తమ దృష్టిలో పెళ్లంటే రెండు మనసలు కలవడమని... అలా చూస్తే తాము పెళ్లి చేసుకున్నట్లేనని అన్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. గౌరీ... కొంతకాలంగా ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా వర్క్ చేశారు. ఆమిర్‌తో ఆమెకు పాతికేళ్ల స్నేహం ఉంది.
ఆమిర్ రీనా దత్తాను వివాహం చేసుకుని 2002లో విడిపోయారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత నిర్మాత కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వీరు వివాహ బంధానికి స్వస్తి పలికారు. 61 ఏళ్ల వయసులో ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌ను ఆమిర్ వివాహం చేసుకోబోతున్నారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















