Aamir Khan Re Entry : ఆమిర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రీ ఎంట్రీకి రెడీ, ఆ సినిమాకు సీక్వెలేనా?

ఆమిర్ ఖాన్ వెండితెరపై సందడి చేసి ఏడాది దాటింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఓ కబురు వచ్చింది. ఈ వార్త అభిమానులను ఖుషి చేస్తోంది.

Continues below advertisement

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) అభిమానులకు ఓ శుభవార్త. ఆయన వెండితెరపై సందడి చేసి ఏడాది దాటింది. ఎంతో ఇష్టపడి, మనసు పడి చేసిన 'లాల్ సింగ్ చద్దా' ఘోరంగా విమర్శకులు ఎదుర్కోవడం, బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టడంతో నటనకు తాత్కాలికంగా ఆయన విరామం ప్రకటించారు. 'లాల్ సింగ్ చద్దా' విడుదలైన ఇన్నాళ్ళకు ఆమిర్ కొత్త సినిమా కబురు వచ్చింది. 

Continues below advertisement

సొంత నిర్మాణ సంస్థలో ఆమిర్ సినిమా
ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందించడానికి ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 16గా ఆ సినిమా తెరకెక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు?
విడుదల ఎప్పుడు ప్లాన్ చేశారు?
సుమారు ఏడాది పాటు కెమెరాకు దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్... మరో నాలుగు నెలలు ఆ విధంగా టైమ్ స్పెండ్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో, 20వ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారట. అయితే... షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ రోజులు టైమ్ తీసుకోవడం లేదు. జనవరిలో షూట్ మొదలు పెడితే... డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అదీ క్రిస్మస్ సందర్భంగా! ఆమిర్ ఖాన్ మినహా ఇతర నటీనటులు, సినిమాకు పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం వెల్లడించలేదు.

అక్షయ్ కుమార్ వర్సెస్ ఆమిర్ ఖాన్!
Akshay Kumar Vs Aamir Khan : ఆమిర్ ఖాన్ రాకతో వచ్చే ఏడాది క్రిస్మస్ వేడి ఇప్పటి నుంచి మొదలు కానుంది. ఆయన రీ ఎంట్రీ సినిమాతో పాటు హిందీ సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'వెల్కమ్ 2' కూడా క్రిస్మస్ సీజన్ విడుదలకు రెడీ అవుతోంది. వీళ్లిద్దరితో పాటు ఇంకా ఎంత మంది హీరోలు వస్తారో చూడాలి.

Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!

ఆమిర్ చేయబోయేది '3 ఇడియట్స్' సీక్వెలా?
ఆమిర్ ఖాన్ అంటే ప్రేక్షకులలో కొన్ని అంచనాలు ఉంటాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే కథానాయకులలో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆ కారణంగా హిందీతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా ఆయనను ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఆమిర్ ఖాన్ గత పది పదిహేను ఏళ్ళల్లో నటించిన సినిమాల్లో '3 ఇడియట్స్' సీక్వెల్ కోరుకునే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఆ సినిమా సీక్వెల్ ద్వారా ఆమిర్ రీ ఎంట్రీ ఇస్తారా? అనేది చూడాలి. 

Also Read ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!

'3 ఇడియట్స్' సీక్వెల్ వర్క్ జరుగుతోందని, ఆ సినిమాలో ఒక కీలక పాత్ర చేసిన షర్మాన్ జోషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి, ఇప్పుడు ఆమిర్ ఖాన్ తన రీ ఎంట్రీ సినిమాకు ఆ కథను ఎంపిక చేసుకున్నారా? లేదా? అనేది లెట్స్ వెయిట్ అండ్ సి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement