Aadi Saikumar's First Review Of Euphoria Movie : 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్, సీనియర్ హీరోయిన్ భూమిక ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజాగా సినిమా చూసి గుణశేఖర్ మూవీపై రివ్యూ ఇచ్చారు. 

మూవీ ఎలా ఉందంటే?

గుణశేఖర్ డైరెక్షన్‌పై యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రశంసలు కురిపించారు. సెన్సిటివ్ ఇష్యూ, రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ అద్భుతంగా ఉందని చెప్పారు. ఓ స్పెషల్ స్టోరీతో రూపొందించారని... క్లైమాక్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉందన్నారు. సోషల్ డ్రామాతో మెసేజ్ ఇచ్చారని... గొప్ప ప్రయత్నానికి గుణశేఖర్ అండ్ టీంను అభినందించారు. 

స్టోరీ ఏంటంటే?

మూవీ చూసిన ఓ జర్నలిస్ట్ సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. 'ఇప్పటివరకూ చాలా సినిమాల్లో పేరెంట్స్ ఎలా ఉండాలి?, పిల్లలను ఎలా పెంచాలి? వారు ఎలా ఉండాలి? అని మాత్రమే చూపించారు. కానీ యుఫోరియా మూవీలో పేరెంట్స్ ఎలా ఉండకూడదు? పిల్లలను ఎలా పెంచకూడదు? అబ్బాయిలు సొసైటీలో ఎలా ఉండకూడదు? అనేది చాలా క్లియర్‌గా చూపించారు. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న హార్డ్ రియాలిటీస్ మూవీలో చూపించారు.

'A' సర్టిఫికెట్ ఉన్నా ప్రతీ పేరెంట్ అబ్బాయిలతో కలిసి చూడాల్సిన సినిమా. పిల్లలకు ఓ బిహేవియర్ ఉంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది చూపించారు. గుణశేఖర్ ఈ మూవీతో కమ్ బ్యాక్ హిట్ సాధిస్తారు' అంటూ చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన పిల్లలు... వారిని కాపాడుకునేందుకు పేరెంట్స్ ఏం చేశారు? అసలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 

Also Read : రామ్ చరణ్ 'పెద్ది' ఎఫెక్ట్ - అఖిల్ అక్కినేని 'లెనిన్' వాయిదా పడనుందా?

మూవీలో భూమిక, సారా అర్జున్‌లతో పాటు నాజర్, రోహిత్, గౌతమ్ మీనన్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికరెడ్డి, విఘ్నేష్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించగా... కాలభైరవ మ్యూజిక్ అందించారు.