Chiranjeevi: 80s రీయూనియన్ - డ్యాన్సులతో అదరగొట్టిన లెజెండరీ స్టార్స్... వీడియోస్ వైరల్
80s Reunion: 80s స్టార్స్ రీయూనియన్‌లో లెజెండరీ హీరోలు, హీరోయిన్లు అంతా కలిసి డ్యాన్సులతో సందడి చేశారు. దీనికి సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

80s Stars Dance In Reunion Event: రీసెంట్‌గా చెన్నైలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా 80s స్టార్స్ రీయూనియన్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఈవెంట్‌లో స్టార్స్ అంతా డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సీనియర్ హీరో నరేష్ తాజాగా షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
డ్యాన్సులు పాటలతో సందడి
చిరు, రాధ కలిసి స్టెప్పులు వేయగా... సుహాసినితో కలిసి నరేశ్ పాట పాడారు. జయసుధ, మీనా, రమ్యకృష్ణ, నదియా ఇలా సీనియర్ హీరోయిన్లు అందరూ ఒకే చోట చేరి అప్పటి విషయాలను షేర్ చేసుకున్నారు. చిన్న పిల్లల్లా మారి ఈవెంట్ ఎంజాయ్ చేశారు. ఒకప్పటి మూవీ ముచ్చట్లు, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే డ్యాన్సులు, పాటలతో సందడి చేశారు. వీటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025
Shubodayam 🥰
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025
Finally the video of the memorable 12th reunion of the class of 80s😍😃#80sStarsReunion pic.twitter.com/gaRIxMKbwo
Also Read: దీపికాకు హీరోయిన్ 'త్రిప్తి డిమ్రి' సపోర్ట్ - 'స్పిరిట్' కాంట్రవర్శీ తర్వాత ఫస్ట్ రియాక్షన్
ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా 80s లెజెండరీ స్టార్స్ గెట్ టు గెదర్‌లో సందడి చేశారు. చిరుత థీమ్ ప్లాన్‌తో చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సుల్లో మెరిశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి దాదాపు 31 మంది సీనియర్ నటీనటులు ఈవెంట్‌లో సందడి చేశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ రాజ్ కుమార్ సేతుపతి, శ్రీప్రియ తమ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేయగా... మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సుహాసిని, సుమలత, జయసుధ, రమ్యకృష్ణ, శ్రీప్రియ, ఖుష్బూ, లిస్సీ, మేనక, శోభన, నరేష్, భానుచందర్, నదియ, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాధ, ప్రభు, రేవతి, భాగ్యరాజ్, సురేష్, పూర్ణిమ, జయరాం, అశ్వతి, సరిత, మీనా, లత, స్వప్న, జయశ్రీ తదితరులు హాజరయ్యారు. 2009 నుంచి రీయూనియన్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.





















