Korean Thrillers: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మూవీ లవర్స్ హాలీవుడ్ సినిమాలను అత్యధికంగా ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం యావత్ సినిమా ప్రపంచంలో ప్రతీ భాష నుంచి కూడా తమ సత్తాను చాటుతున్నాయి. ఏ భాష ప్రేక్షకులు అయినా హార్రర్, థ్రిల్లలర్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొరియన్ థ్రిల్లర్స్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇండియాలో కూడా చాలా మంది ఈ కొరియన్ మూవీలను చూస్తున్నారు. ఓటీటీలు పుణ్యమా అని సినిమాకు సినిమాకు మధ్య భాషా బేధాలు బాగా తగ్గిపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది ఏ భాష సినిమా అయినా చుస్తున్నారు మూవీ లవర్స్. అందుకే థ్రిల్లర్ సినిమా లవర్స్ కోసం 13 బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఇక్కడ సూచిస్తున్నాము.
1. ‘ది కాల్’
ఈ సినిమా 2020 లో వచ్చింది. మూవీలో ఒక అమ్మాయి తన ఫోన్ ను కోల్పోతుంది. అయితే ఆ ఫోన్ ను వెతికే ప్రయత్నంలో ఒక పాత టెలిఫోన్ నుంచి ఓ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు 1999 లో అదే ఇంట్లో గడిపిన ఆమె నుంచి. వీరిద్దరికి మూడు దశాబ్దాల గ్యాప్ ఉన్నా వారు ఆ ఫోన్ లో కమ్యూనికేట్ చేసుకుంటారు. పాస్ట్, ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడే కథ మొదలవుతుంది. ఆ ఫోన్ వల్ల వారి జీవితాలు ఎలా మారాయి? చివరకు ఏమైంది అనేదే కథ. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
2.‘అన్ లాక్డ్’
ఈ సినిమాలో ఒక హారోయిన్ ఒక మార్కెట్ కంపెనీలో పనిచేస్తుంది. ఖాళీ సమయంలో వాళ్ల నాన్న కాఫీ షాప్ లో సాయం చేస్తుంది. అయితే ఓసారి తన ఫోన్ బస్ లో వెళ్తుండగా పోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోన్ ను ఓ షాప్ లో ఉంది తీసుకోమని ఓ అన్ నౌన్ ఫోన్ వస్తుంది. తర్వాత ఆ అమ్మాయి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఫోన్ చేసిన వాళ్లు ఎవరు? అనేది సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూసేయండి.
3. ‘ఓక్జా’
ఆస్కార్ అవార్డును అందుకున్న కొరియన్ దర్శకుడు బాంగ్ జో హో తీసిన సినిమానే ఈ ‘ఓక్జా’. ఇందులో ఓ సూపర్ పిగ్స్ ను తయారు చేసే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ సృష్టించిన ‘ఓక్జా’ అనే సూపర్ పిగ్ తో సినిమాలో హీరోయిన్ స్నేహం చేస్తుంది. కొన్నాళ్లకు ఆ కంపెనీ వాళ్లు ఆ పిగ్ ను తీసుకుపోతారు. తర్వాత ఏమైంది. ఆ పిగ్ ను వాళ్లు ఏం చేశారు. ఆ అమ్మాయి దాన్ని విడిపించిందా అనేదే సినిమా. ఇందులో జంతు హింస, మనుషులకు జంతువులకు ఉన్న బాండింగ్ ను చక్కగా చూపిస్తారు. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే అందుబాటులో ఉంది.
4. ‘మథర్’
ఒక సౌత్ కొరియన్ పల్లెటూరులో ఓ తల్లి కొడుకు నివాసం ఉంటారు. కొడుక్కి కొంచెం మానసిక సమస్య ఉంటుంది. ఆ కొడుకుని తల్లి జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే ఓ రోజు ఆ ఊరిలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య ఆమె కొడుకే చేశాడని ఆరోపిస్తారు. అసలు ఆమె కొడుకుని ఎలా కాపాడుకుంది? హత్య ఎవరు చేశారు అనేదే సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
5.‘డిసిషన్ టూ లీవ్’
ఓ పోలీస్ అధికారి ఓ హత్య కేసును చేధిస్తుంటాడు. ఆ హత్య కాబడిన వ్యక్తి భార్యే ఆ హత్య చేసిందని ఆరోపిస్తారు. అయితే నిజంగా ఆ హత్య భార్యే చేసిందా లేదా అనేదే సినిమా. అయితే ఇందులో డిటెక్టివ్ కు హీరోయిన్ కు మధ్య లవ్ ట్రాక్ కూడా యాడ్ అవ్వడంతో కొత్త కొత్త ట్విస్ట్ లతో మూవీ చాలా సస్పెన్స్ గా సాగుంతుంది. రెగ్యులర్ థ్రిల్లర్స్ లా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ముబి లో అందుబాటులో ఉంది ఓ లుక్ వేసేయండి.
6. ‘ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్’
ఈ సినిమాలో ఓ టీనేజ్ అమ్మాయికి వచ్చిన మానసిక సమస్యకు వైద్యం చేయడానికి ఒక పిచ్చాసుపత్రిలో వేస్తారు. అయితే తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక తన నాన్న, చెల్లి, సవతి తల్లి లతో జరిగే సన్నివేశాలే ఈ మూవీ. కుటుంబంలో ఉన్న చీకటి గతం వలన ఒక ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మూవీలో చాలా బాగా చూపించారు. ఇది ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
7. ‘స్టీల్ రైన్’
నార్త్ కొరియాలో జరిగే పొలిటికల్ థ్రిల్లర్ సినిమానే ఇది. ప్రభుత్వాన్నే ఓవర్ త్రో చేసే టాపిక్ తో మూవీ రన్ అవుతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉంటాయి. పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
8. ‘స్నో పియర్సర్’
గ్లోబల్ వామింగ్ పై ఈ మూవీ కథ నడుస్తుంది. భవిష్యత్ లో గ్లోబల్ వామింగ్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి మనుషులు ఓడిపోతారు. మిగిలిన కొంత మంది మనుషులు ఓ రైలు లో నాన్ స్టాప్ గా జర్నీ చేస్తూనే ఉంటారు. ఇందులో రిచ్ అండ్ పూర్ టాపిక్ ను చక్కగా చూసిస్తూనే వాళ్ల మధ్య జరిగిన సంభాషణ, సన్నివేశాలను చూపిస్తారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
9. ‘ది ఔట్ లాస్’
కొరియన్ క్రైం ఎంటర్టైనర్ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో చైనీస్ అండ్ కొరియన్ గ్యాంగ్ ల మధ్య జరిగిన రియల్ లైఫ్ ఈవెంట్స్ ను బేస్ చేసుకొని ఉంటుందీ మూవీ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. ఈ మూవీ లు రెండు ప్రైమ్ లో ఉన్నాయి చూసేయండి.
10. ‘హంట్’
ఈ మూవీలో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ను చంపడానికి నార్త్ కొరియన్స్ ట్రై చేయడం. వాళ్లని సౌత్ కొరియన్ వాళ్లు ఎలా ఆపారు అనే రియల్ లైఫ్ ఈవెంట్ ను బేస్ చేసుకొని మూవీ రన్ అవుతుంది. మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ మూవీ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
11. ‘ది హోస్ట్’
సముద్రం నుంచి వచ్చిన ఓ విచిత్రమైన జీవి ప్రజల్ని హింసిస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఆర్మీ వాళ్లు రంగంలో దిగుతారు. ఆ విచిత్ర జీవినుంచి ప్రజల్ని కాపాడటానికి ఓ సీల్ ను వేస్తారు. అయితే హీరో కూతురు ఆ సీల్ ను క్రాస్ చేస్తుంది. ఆ పాపను ఎలా కాపాడారు, చివరికి ఏం జరిగింది అనేదే సినిమా. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
12. ‘ఇన్నిసెన్స్’
ఈ మూవీలో కొంతమంది కొరియన్ సాంప్రదాయ డ్రింక్ అయిన రైస్ వైన్ ను తాగి చనిపోతారు. అందులో విషం కలిపి ఇచ్చింది అని ఒక ఆమె పై ఆరోపణలు చేస్తారు. అయితే ఆమె కూతురు లాయర్. అసలు ఏం జరిగింది అనే విషయాలను కనిపెడుతుంది. వాళ్లని ఎవరు చంపారు ఏం జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
13. ‘ది విచ్’
ఒక సీక్రెట్ లాబ్ లో జరిగిన ఎటాక్ నుంచి ఒక చిన్న పిల్ల తప్పించుకుంటుంది. ఆ పాపను ఒక రైతు దగ్గరకు తీస్తాడు. అయితే ఆ పాపను వెతుక్కుంటూ ఓ గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. ఇంతకీ ఆ గ్యాంగ్ ఏంటి, లాబ్ లో ఏం జరుగుతుంది. ఆ పాపను ఎలా కాపాడారు అనే విషయాలను సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.