మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాను పూర్తి చేసి ఇప్పుడు 'లూసిఫర్' రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. చిరు కెరీర్లో 153వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ను శుక్రవారం నాడు మొదలుపెట్టారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలపై ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Pushpa First Single 'పుష్ప' ఫస్ట్ సింగిల్ మామూలుగాలే.... ఫ్యాన్స్‌కు పూనకాలే..
అయితే ఈ సినిమాలో మొదటి పాట రికార్డింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు చిరంజీవి, మోహన్ రాజాలతో కలిసి తీసుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. లైఫ్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే రోజని.. చిరు 153 సినిమా కోసం పాట పూర్తి చేశామని.. ఓ అభిమానిగా చిరంజీవి గారి అభినందనలు అందుకోవడం చాలా స్పెషల్ గా ఉందంటూ రాసుకొచ్చారు.
Also Read :Sridevi Birth Anniversary : చీరకట్టులో మైమరిపించే అందం.. అతిలోక సుందరి సొంతం..
తొలిరోజు సినిమా షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించి టీమ్ తో కలిసి ఉన్న ఫోటోను దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే హీరోయిన్ నయనతార కూడా ముఖ్య పాత్రలో కనిపించనుందని సమాచారం.