రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయమైన సినిమా అద్భుతం. తేజా సజ్జా హీరోగా చేసిన ఈ మూవీ హాట్ స్టార్ డిస్నీలో విడుదలైంది. ఈ సినిమాకు దాదాపు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరు కూడా అద్భుతం సినిమాను చూసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈతరం సినిమా. తేజా సజ్జా, శివాని నటన చాలా బాగుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తుంది. టీమ్ అంతటికీ కంగ్రాట్యులేషన్స్’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. తన ట్వీట్ తో అద్భుతం యూనిట్ కు ఎంతో ఆనందాన్ని పంచారు చిరు. ఈ ట్వీట్ కి శివాని థ్యాంక్స్ చెబుతూ రీ ట్వీట్ చేసింది.
కాలం కాన్సెప్ట్ తో...
టైమ్ పీరియడ్ కాన్సెప్ట్ తో వచ్చిన మరో సినిమా అద్భుతం. అంతకుముందు ప్లేబ్యాక్, కుడిఎడమైతే వెబ్ సిరీస్ లు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు అద్భుతం కూడా కాలం కాన్పెప్ట్ తో వచ్చి అందరినీ అలరిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగేళ్ల టైమ్ గ్యాప్ తో నడిచే ఇద్దరు వ్యక్తులను, ఒకే కథలో జోడించి తెరకెక్కించారు. మధ్యలో కాస్త హాస్యాన్ని, ఉత్కంఠను కూడా యాడ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టు అద్భుతంగా లేకపోయినా... నిరాశ పరచదు. ఒకసారి చూసేట్టుగానే ఉంది ఈ మూవీ.