Chinni Serial Today Episode: చిన్ని గురించి మళ్లీ ఎప్పుడూ  తెలుసుకునే ప్రయత్నం చేయొద్దంటూ నాగవల్లి మ్యాడీ వద్దమాట తీసుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుని నటిస్తూ అతనితో ఒట్టు వేయించుకుంటుంది. 

Continues below advertisement

మధు పదేపదే చందు ఇంటికి వస్తుండటంతో వాళ్ల అమ్మకు అనుమానం వస్తుంది. కొంపదీసి ఈ అమ్మాయి మా అబ్బాయికి లైన్‌ వేస్తోందా అని అనుమానిస్తుంది.ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడగ్గా....కాలనీలో ఓ ప్రెండ్‌ను  కలవడానికి వచ్చి  మాస్టార్‌ను  చూసి వెళ్తామని వచ్చానని బదులిస్తుంది మధు. ఎందుకైనా మంచిదని...మా అబ్బాయికి ఈ మధ్య మంచిమంచి సంబంధాలు వస్తున్నాయని...కట్నం కూడా బాగా ఇస్తామంటున్నారని చెబుతుంది. గుంటూరు  సంబంధం కుదిరేలా ఉందని...ఈ ఏడాదే పెళ్లి చేస్తామని చెబుతుంది.  దీనికి మధు కంగ్రాట్స్ చెప్పి  పెళ్లికి మాత్రం తప్పకుండా పిలవాలని చెబుతుంది. పెళ్లి విషయం చెప్పినా  మధులో ఎలాంటి కంగారు లేకపోవడంతో చందు వాళ్ల అమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. మా అబ్బాయిపై మధుకు ఎలాంటి ఫీలింగ్‌ లేదన్నమాట అనుకుంటుంది. నీతో,ఆంటీతో,లోహితతో మాట్లాడుతుంటే....సొంతవాళ్లతో మాట్లాడినట్లే అనిపిస్తుందని మధు  చందుతో అంటుంది. చిన్న విషయానికే ఎంత సంతోషిస్తుందో చూశావమ్మా...తనను చూస్తుంటే చిన్ని గుర్తుకు రావడం లేదు అంటాడు వాళ్ల అమ్మాతో. దీంతో కోపంగా దాని ప్రస్తావన తీసుకురావొద్దంటుంది. మధు కలుగజేసుకుని ఏళ్లు గడిచినా  చిన్నిమీద కోపం మీ అమ్మాకు ఇంకా పోలేదని అంటుంది. చచ్చేవరకు దానిపై కోపం పోదని అంటుంది. చందు కలుగజేసుకుని ఇందులో చిన్ని తప్పు ఏముందని అంటాడు. వాళ్ల అమ్మానాన్నలకు పుట్టడమే చిన్ని చేసిన తప్పు అంటుంది. వాళ్లలో ఎవరైనా  నా కంటపడితేనా అంటుంది... వెంటనే మధు కలుగజేసుకుని   వాళ్లు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదా ఆంటీ అంటుంది.  దీనికి చందువాళ్ల అమ్మతెలియదు అని సమాధానమిస్తుంది. ఒకవేళ చిన్ని గానీ, వాళ్ల నాన్నగానీ మీ కంటపడితే నాకు ఒకసారి చెప్పండి ఆంటీ అని మధు అడుగుతుంది. నీకు ఎందుకు అని అడుగుతుంది. మీకు ఇంత అన్యాయం చేసిన వాళ్లను  ఒక దులుపు దులిపేస్తానంటుంది. చిన్ని వాళ్ల ఫ్యామిలో ఎవరు కనిపించినా  నేనే  పీకపిసికి చంపేస్తానంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లోహిత...ఈమె మళ్లీ ఎందుకు  వచ్చిందని అంటుంది.

   చందు వాళ్ల అమ్మ ఆవేశం చూసి  మళ్లీ గతాన్ని తవ్విందా అని అడుగుతుంది. చిన్ని వాళ్ల కుటుంబం గురించి పదేపదే అడుగుతున్నావంటే....కొంపదీసీ నువ్వు చిన్నికి ప్రెండ్‌వు కాదు కదా  అని నిలదీస్తుంది. తను పంపిస్తే  నువ్వు మా ఇంటికి ఏం రావడం లేదు కదా అంటుంది. నువ్వు పదేపదే ఈ ఇంటికి ఎందుకు వస్తున్నావు అని లోహితా  అడిగితే...నువ్వు ఎందుకు వేరే వాళ్ల ఇంట్లో ఉంటున్నావ్‌ అని  ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో లోహితా ఒక్కసారిగా  కంగారుపడుతుంది. చందు కలుగజేసుకుని వేరేవాళ్ల ఇంట్లో ఉండటం ఏంటని అంటాడు..ఏం లేదు వేరే పీజీలో ఎందుకు ఉంటున్నావని అడిగానని  మధు మాటమారుస్తుంది. నువ్వు మా ఇంటికి వస్తే వచ్చావు గానీ...నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవద్దని లోహిత అనగా...సరేనని  మధు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ఆమె వెళ్లిపోయిన తర్వాత లోహిత చందుతో అంటుంది...స్టూడెంట్స్‌కు  ఇంత చనువు ఇవ్వొదని చెబుతుంది. 

Continues below advertisement

  చిన్ని వాళ్ల నాన్న బాలరాజును తప్పించడానికి హాఫ్‌టిక్కెట్ ప్రయత్నించడం  నాగవల్లి వాళ్ల భర్త సీసీ కెమెరాలో చూస్తాడు. అప్పుడు రౌడీగ్యాంగ్‌లో ఓ సభ్యుడు  ఫోన్‌చేసి ఇదే విషయం చెబుతాడు. అందుకే బాలరాజును వేరేచోటకి మార్చామని బదులిస్తాడు. ఎట్టిపరిస్థితుల్లో ఆ బాలరాజు ఎక్కడ ఉన్నాడనే విషయం హాఫ్‌టిక్కెట్‌గాడికి తెలియకూడదంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నాగవల్లి ఏం జరిగిందని అడగ్గా...బాలరాజును  వేరేచోటకి షిప్ట్ చేశామని బదులిస్తాడు. ఎక్కడ దాచి ఉంచావో చెప్పు బావ...తుపాకీ తీసుకెళ్లి కాల్చి చంపేస్తానంటుంది నాగవల్లి. పీడ వదిలిపోతుందంటుంది. ఆవేశపడకు నాగవల్లి...వాడి ద్వారానే  వాడి కూతురు  ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాం కదా అంటాడు. అందుకే వాడిని బతకనిస్తున్నా అంటాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా వాడు చెప్పడం లేదు కదా....నాకు ఒక్క ఛాన్సు ఇస్తే నేను వెళ్లి వాడి ద్వారా చిన్ని  వివరాలు కక్కిస్తానంటాడు. అమ్మో చిన్న వివరాలు నీకు తెలియకూడదని మనసులో అనుకుని....వద్దు నాగవల్లి ఈ వ్యవహారం నేను చూసుకుంటాను  అంటాడు. నువ్వు మ్యాడీ మనసులోకి మళ్లీ చిన్ని రాకుండా చూసుకో అంటాడు. నా ప్రయత్నం నేను చేస్తునే  ఉన్నా....వాడే అప్పుడప్పుడు ఇంకా చిన్నిచిన్ని అంటున్నాడని అంటుంది. వాడు పూర్తిగా  చిన్ని గురించి ఆలోచించడం మానేస్తేనే  మనం అనుకున్నది అనుకున్నట్లుగా  జరుగుతుందని నాగవల్లి చెబుతుంది. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని...వాడి జీవితంలోకి  శ్రియ త్వరగా ఎంటరవ్వాలని  సలహా ఇస్తుంది. వీలైనంత త్వరగా  మన మ్యాడీకి,శ్రియకు  పెళ్లి జరగాలని చెబుతుంది. అప్పుడే మనకు ఆ చిన్ని పీడ వదులుతుందని నాగవల్లి అంటుంది. 

    చందును కలిసి తిరిగి వెళ్లిపోతున్న మధును బయట లోహిత అడ్డుకుంటుంది. ఏంటి నువ్వు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డావని మధు నిలదీస్తుంది. నువ్వు మా ఇంటికి అడ్డదారుల్లో వస్తే...నేను ఇలాగే అడ్డంగా  వస్తానని అంటుంది. అడ్డదారుల్లో వచ్చి అడ్డమైన ప్లాన్స్ వేయడం నీకు అలవాటు గానీ...నాకు అలాంటి ఖర్మపట్టలేదని మధు బదులిస్తుంది. అయినా నేను పరాయివాళ్ల ఇంటికి రాలేదని...నేను మా మేనమామ ఇంటికే వచ్చానని అంటుంది.నువ్వు కూడా మా మేనమామ కూతురివే కదా అనగా....నేను  అలా అనుకోవడం లేదని లోహిత బదులిస్తుంది. మా నాన్న చనిపోయినప్పుడే  మీకు మాకు బంధం తెగిపోయింది అంటుంది. మనుషులను చంపే మీలాంటి వాళ్లతో ఎవరూ సంబంధాలు పెట్టుకోరని  ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మిమ్మల్ని ప్రేమించి ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్న మానాన్ననే  చంపేసిన దుర్మార్గులు మీరు అంటుంది. మా జీవితాన్న వీధిని పడేశారని మండిపడుతుంది. ఇప్పుడు అటు మహి వాళ్ల జీవితాలతోనూ  ఆడుకుంటున్నావ్ కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మా నాన్నని మీ నాన్న చంపితే....మహివాళ్ల అమ్మను మీ అమ్మ చంపిందని అంటుంది.  అయినా కూడా నువ్వు మహితో ప్రెండ్‌షిప్ చేస్తూ వాళ్ల ఇంటికి వెళ్తున్నావు. మా అన్నయ్యతో పరిచయం పెంచుకుని మాఇంటికే వస్తున్నావని  నిలదీస్తుంది. మమ్మల్ని కూడా చంపేద్దామని ప్లాన్‌ చేస్తున్నావా అని నిలస్తుంది. ఈమాటలకు మధుకు తీవ్ర కోపం వస్తుంది.మాటలు మర్యాదగా రానివ్వాలని గట్టిగా  సమాధానమిస్తుంది. మీరు అనుకున్నట్లు మా అమ్మానాన్న ఆ మర్డర్సు చేయలేదని బదులిస్తుంది. ఎవరో చేసిన నేరాలకు మేం నిందలు మోస్తున్నామని అంటుంది. నువ్వు అనుకున్నట్లు నేను మహి ఇంటి చుట్టూ తిరుగుతుంది నీలా కుట్రలు చేయడానికి  కాదని అంటుంది. మహి బాధను తగ్గించడానికి అంటుంది. నీలా వాళ్ల ముందు మంచిదానిలా  నటించడం లేదని....వాళ్లకు మంచి జరగాలనే కోరుకుంటున్నానని చెబుతుంది. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నేను నా ప్రయత్నాలు మానుకోను అంటుంది.నిజాలు మహికి తెలిసేలా  నిజం నిరూపిస్తానని అంటుంది.  మా అమ్మానాన్నలపై వచ్చిన నిందలు మాసిపోయేలా చేస్తానని అంటుంది. అది ఈ జన్మలో జరగదని లోహితా....అంటే మున్ముందు నువ్వే చూస్తావు కదా అని మధు బదులిస్తుంది. చిన్నిపై మహికి  ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుకదా..అది తొలగించడం నీతరం కాదని అంటుంది. త్వరలోనే మహి అన్ని నిజాలు తెలుసుకుని చిన్నిని ప్రేమించేలా చేస్తానని సవాల్ విసిరి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మ్యాడీ దీనికి దగ్గర కాకుండా చేయాలని లోహిత అనుకుంటుంది.

నిద్రపోతున్న మ్యాడీని లేపి ఇంట్లో ఉన్న అందరూ అతని బర్త్‌డే విషెష్ చెబుతారు. తల్లిదండ్రుల వద్ద మ్యాడీ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి...రేపు గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేస్తున్నామని వాళ్ల నాన్న చెబుతాడు. దీనికి మ్యాడీ సరేనంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వాచ్‌మెన్‌...మీ కోసం మీ ప్రెండ్స్‌వచ్చారని చెప్పడంతో మ్యాడీ బయటకు వెళ్తాడు. కొంపదీసి మధు వచ్చిందేమోనని లోహిత...నాగవల్లితో అనడంతో ఆమె కూడా బయటకు వెళ్తుంది. బయట మధు తన ప్రెండ్స్‌తో వచ్చి కేక్‌ కట్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇంత రాత్రివేళ్ల ఏకంగా ఇంటికే వచ్చేసిందని  లోహిత...నాగవల్లికి ఎక్కించి చెబుతుంది. మ్యాడీ కేక్‌ కట్‌చేసి అందరికీ తినిపిస్తాడు. మధునే గుర్తచేసి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిందని మ్యాడీ ప్రెండ్స్‌చెబుతారు.

  నేను అనుకున్నంత ఈజీగా ఇది మ్యాడీకి దూరమయ్యేలా లేదనిలోహిత అనుకుంటుంది. దీనికి గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప కంట్రోల్ అవ్వదని నాగవల్లి కూడా అనుకుంటుంది. బయటకు వచ్చి మ్యాడీని పిలిచి మీ నాన్నగారు రమ్మంటున్నారని చెబుతుంది.అతను లోపలికి వెళ్లబోతూ....రేపటి బర్త్‌డే పార్టీకి మా ప్రెండ్స్‌ను పిలుస్తానని చెప్పడంతో నాగవల్లి సరేనంటుంది. నేను కూడా వచ్చింది వాళ్లను రమ్మని చెప్పడానికేనంటుంది. నువ్వు లోపలికి వెళితే నేను వాళ్లను రేపు రమ్మని చెప్పి పంపిస్తానని నాగవల్లి మధు దగ్గరకు రావడంతో ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది..