తెలుగులో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా B&W(బ్లాక్ అండ్ వైట్). ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను ఇటీవలే విడుదల చేసింది మూవీ టీమ్. 'కుమారి 21f' సినిమాతో మంచి హిట్ అందుకుంది హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమాలో తన నటన యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ అయింది. మూవీ థీమ్ డిఫరెంట్ గా ఉండటంతో యూత్ ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత హెబ్బా కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే హెబ్బా కు అప్పటినుంచి సరైన హిట్ పడలేదు. ఒక భారీ హిట్ కోసం హెబ్బా వెయిట్ చేస్తోంది. అయితే ఇటీవల B&W(బ్లాక్ అండ్ వైట్) సినిమాలో నటించింది హెబ్బా. ఈ సినిమాతో అయినా సరైన హిట్ వస్తుందేమో అని ఎదురు చూస్తోంది హెబ్బా పటేల్. 


ఇక గ్లామర్ రోల్స్ ఒక్కటే కాకుండా అన్ని షేడ్స్ లోనూ రాణించాలనుకుంటుటోంది హెబ్బా. అందుకే విభిన్నమైన పాత్రలు కూడా చేయడానికి రెడీ అవుతోంది. హెబ్బా మెయిన్ ప్రధాన పాత్రలో నటించిన B&W (బ్లాక్ అండ్ వైట్) టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. టీజర్ లో హెబ్బా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. టీజర్ బిగినింగ్ లో ఓ డైలాగ్ తో మొదలయింది. ‘‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ తో సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. టీజర్ లో యూత్ ను  ఆకట్టుకొనే అంశాలతో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్‌లో సస్పెన్స్ గా చూపించారు.


టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఫుల్ లెన్త్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లా కనిపిస్తోంది. మూవీ లో విజువల్స్ కూడా బాగానే ఉన్నాయనిపిస్తోంది. టి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ గా కనిపిస్తోంది. హెబ్బా పటేల్ టీజర్ లో డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించింది. టీజర్ మొత్తం ఉత్కంఠగభరితంగా సాగటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్, వి విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసి వీక్షించారు. సినిమా మంచి టాక్ తెచ్చుకోవాలని ఆకాక్షించారు. ఇక ఈ సినిమాను పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్‌ఆర్ ఆర్ట్స్, ఏ యూ అండ్ ఐ స్టూడియోస్, ఎ మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు. ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం. అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. బి&డబ్ల్యూ (బ్లాక్ & వైట్) చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ గా ఉంది. వీలైనంత త్వరగానే సినిమాను విడుదల చేయడానికి చూస్తున్నారు మూవీ టీమ్. ఈ సినిమాతో అయినా హెబ్బా కు మంచి హిట్ దక్కతుందేమో చూడాలి.



Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?