రాజ్ తో పెళ్లి చూపులంటే ఉత్సాహంగా లేదు, రాహుల్ విషయం తల్లితో చెప్పాలని స్వప్న అనుకుంటుంది. స్వప్న వాళ్ళ కుటుంబం ఆచారాలు, సాంప్రదాయాలు నచ్చితేనే పెళ్లి జరుగుతుందని అపర్ణ అంటుంది. ఎలాగైనా ఈ పెళ్లి చేయాలని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతవరకు ఆ మాటలతో కనకం కోట కట్టింది, ఇప్పుడు కోటలాంటి ఇల్లు చూడటానికి వెళ్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని రుద్రాణి అనుకుంటుంది. ఇక కనకం తన అక్క మీనాక్షి ఇంటికి స్వప్నని తీసుకుని వస్తుంది. ఇంత రిచ్ ఇంట్లో నీ పెళ్లి చూపులు జరుగుతున్నాయ్ అని తెగ సంబరపడుతుంది. అక్కని పిలిచి హగ్ చేసుకుని లేనిపోని ప్రేమ నటిస్తుంది. ఇద్దరూ తింగరి తింగరిగా మాట్లాడుకోవడం చూసి స్వప్న వింతగా ఫేస్ పెడుతుంది.


Also Read: కేఫ్ మూయించేందుకు గాయత్రి కుట్ర- అత్తకి ఎదురు తిరిగి భార్య మనసు గెలుచుకున్న అభి


ఒక ఆడపిల్ల పెళ్లి కోసం నువ్వు ఆడే అబద్ధాలకు వంత పాడతాను తప్ప నిజాలు చెప్పను అలాగని అబద్ధాలు ఆడనని మీనాక్షి చెప్తుంది. అప్పుడే స్వప్నకి రాహుల్ ఫోన్ చేస్తాడు. పెళ్లి చూపులకు తాను రావడం లేదని చెప్తాడు. తనతో మాట్లాడుతూ ఉండగా రాజ్ వస్తాడు.. వాళ్ళ మాటలు ఎక్కడ విన్నాడో అని టెన్షన్ పడతాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని రాజ్ వచ్చి అడుగుతాడు. ఈవెంట్ గురించి మాట్లాడుతున్నా అని అబద్ధం చెప్పి కవర్ చేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. న్యూ డిజైన్ జ్యుయలరీని లాంఛ్ చేయిస్తున్నాం, దానికి చాలా మంది మోడల్స్ వస్తున్నారు, ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా స్వప్న అని చెప్పేసరికి తెగ సంబరపడిపోతుంది.


రాహుల్ మాటలకి పొంగిపోయి తప్పకుండా వస్తానని చెప్తుంది. పెళ్లి చూపులు కదా అని అనేసరికి ఒక గంట ప్రోగ్రామ్ అని రాహుల్ అంటాడు. అయితే వస్తాను ఇక్కడ రాజ్ మొహం చూసెకంటే అక్కడికి వెళ్తే చాలా మంది సెలబ్రెటీలు వస్తారు పరిచయం చేసుకోవచ్చని అనుకుంటుంది. స్వప్న తన ట్రాప్ లో పడిపోయిందని పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపులు ఏంటని రాజ్ వాళ్ళ అమ్మ పెళ్లి క్యాన్సిల్ చేస్తుందని రాహుల్ సంతోషపడతాడు. అటు స్వప్న పెళ్లి కోసం డబ్బు సంపాదించాలని రాత్రి పగలు లేకుండా కష్టపడుతుంది. నువ్వు చెప్పిన అబద్ధాలు అన్నీ బయటపడితే రేపు స్వప్న పరిస్థితి ఏంటని మీనాక్షి కనకాన్ని అడుగుతుంది. ఒక్కసారి మూడు ముళ్ళు పడితే తప్పు నాది అవుతుందని స్వప్నని బాగా చూసుకుంటారని కనకం చెప్తుంది.


Also Read: వేదని ప్రేమిస్తున్నట్టు చెప్పిన విన్నీ, వినేసిన యష్ - మాళవికని సైడ్ చేసేందుకు భ్రమరాంబిక స్కెచ్


వైద్యం చేయించలేక కొడుకుని పోగొట్టుకున్నా ఇప్పుడు మంచి సంబంధాలు పోగొట్టి వాళ్ళ బతుకు కూడా నా బతుకులాగా మార్చమంటావా అని కనకం ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నాకు ఎటు ఆడపిల్లలు లేరు కదా నీ కూతురి పెళ్లి నా కూతురుగా చేస్తానని మీనాక్షి మాట ఇస్తుంది. పెళ్లి వాళ్ళ కోసం చేసిన పిండి వంటలు అన్ని సర్ది కావ్య తీసుకెళ్లమని అప్పుకి ఫోన్ చేస్తుంది. బండి చెడిపోయిందని ఏదో ఒకటి చేసి స్వీట్స్ తీసుకువెళ్తానని అప్పు చెప్తుంది. ఇక స్నాక్స్ ఎవరు తీసుకువెళ్ళాలా అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అటు స్వప్న రాహుల్ పిలిచిన ఈవెంట్ కి వెళ్ళడం కోసం ఎవరితో చెప్పకుండా సైలెంట్ గా వెళ్లబోతుంటే కనకం ఆపుతుంది. ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది.