Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలిమినేషన్స్ చూసాక బిగ్ బాస్ హౌస్ బూతు పురాణానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందా ? అనిపిస్తోంది. ఇప్పటికే నోరు అదుపులో పెట్టుకోండి అంటూ నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పటికీ కంటెస్టెంట్స్ మాత్రం దున్నపోతుపై వర్షం పడ్డట్టుగా ఆయన మాటలను పెడ చెవిన పెట్టేశారు. నామినేషన్లలో నోటికొచ్చినట్టుగా మాట్లాడి హీట్ పెంచారు. "ఈ సీజన్లో నేను ఉన్నంత వరకూ నిన్ను నామినేషన్ చేస్తాను" అంటూ శపథం చేసింది యష్మి గౌడ. మరి మూడవ వారం యష్మి గౌడ, మణికంఠ మధ్య మూడో వారం నామినేషన్లలో జరిగిన డిస్కషన్ ఏంటో తెలుసుకుందాం పదండి.


నువ్వేంటి బొక్క... నాగ మణికంఠపై నోరు పారేసుకున్న యష్మి గౌడ


ఈ వారం నామినేషన్ లో మణికంఠ యష్మి గౌడను నామినేట్ చేశాడు. ఆ టైమ్ లో మణికంఠ మాట్లాడుతూ "నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగట్లేదు అని అన్ని విషయాలను చూడాలి" అంటూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే మధ్యలో మాట్లాడుతూ "మాకు లగ్జరీ వచ్చినప్పుడు మేము కడగక్కర్లేదు" అంటూ చెప్పింది. దీంతో మణికంఠ "నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ" అంటూ గట్టిగా అరిచాడు. ఆ వెంటనే యష్మి గౌడ ఫైర్ అవుతూ "నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా డ్రామాలు చేస్తావు చూడు.." అని కొత్త టాపిక్ తీసింది. అయితే మణికంఠ ఆమె స్టేట్మెంట్ ను ఒప్పుకోకుండా "నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే నేను రైజ్ చేస్తాను" అంటూ తన పాయింట్ చెప్పాడు. వెంటనే "నువ్వేంటి బొక్క రైజ్ చేసేది" అంటూ బూతు పురాణం మొదలెట్టింది. అంతేకాదు మణికంఠపై రివేంజ్ గా తిరిగి నామినేట్ చేస్తూ "నేను ఈ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతి నామినేషన్ లో నీ పేరే తీసుకుంటాను. నువ్వు నా హార్ట్ ను బ్రేక్ చేశావు. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేశావు" అంటూ యష్మి గౌడ మాట్లాడడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే "అది మోసం కాదు" అంటూ మణికంఠ సర్ది చెప్పబోతే, "ఇది నా నామినేషన్ గురూ నిల్చో" అంటూ ఓవర్ యాటిట్యూడ్ చూపించింది యష్మి గౌడ. ఇక మణికంఠ చేసేదేం లేక "చూస్తా గురూ" అంటూ గట్టిగా సమాధానం చెప్పి సైలెంట్ అయిపోయాడు. 


Read Also : Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం వచ్చేది' ఆ రోజే - ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్? 


బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం 


సీజన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రెండు వీకెండ్ లో కూడా నాగార్జున అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తూ వస్తున్నారు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఏమో గాని బూతు మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ లో. గత వారం టాస్క్ లలో భాగంగా పృథ్వీ ఎఫ్ వర్డ్స్ వాడుతూ నాగార్జున చేత మొట్టికాయలు వేయించుకున్నాడు. ఇక అలాగే సోనియా కూడా అడల్ట్రేటెడ్ కామెడీ అంటూ విష్ణు ప్రియ ను టార్గెట్ చేసింది. ఈ ఇద్దరినీ నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ రెండవ వారం వీకెండ్ ఎపిసోడ్ లో స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. ఆయన ఆ మాట చెప్పి ఒక్క రోజు కూడా గడవకముందే యష్మి గౌడ బొక్క అంటూ మళ్ళీ మొదలుపెట్టింది.


Read Also :Sekhar Basha: ఎలిమినేషన్ వెనకున్న కారణం ఇదే - సీక్రెట్ బయట పెట్టేసిన శేఖర్ బాషా