బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
 
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.


21వ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన రేవంత్ తో నాగార్జున కాసేపు మాట్లాడారు. తనకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలవాటు అని.. దానివల్ల జనాలు తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంటుందని రేవంత్ అన్నారు. 'నువ్ మంచి పాటగాడివే కాదు.. ప్లే బాయ్ అని కూడా విన్నాను' అంటూ కాసేపు ఆడుకున్నారు నాగార్జున. 


నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వబోతున్న విషయాన్ని రేవంత్ ముందే వెల్లడించారు. బిగ్ బాస్ పేరు ఎత్తకుండా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. 'జీవితంలో కొన్నింటిని సాక్రిఫైజ్ చేయడం కష్టంగా ఉంటుంది. నా భార్యతో పాటు నాకిష్టమైన మ్యూజిక్ ను కూడా మిస్ అవుతున్నాను. కానీ ఒక భగీరధుడు సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తా.. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్టైన్మెంట్ కి అంతా రెడీ. మీ సపోర్ట్ తో టైటిల్ గెలిచి వస్తా..' అంటూ ఓ లెటర్ షేర్ చేశారు. దీంతో ఆయన బిగ్ బాస్ హౌస్ కి వెళ్లబోతున్నట్లు అభిమానులకు ముందే తెలిసిపోయింది. 


ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం చాలా మంది పోటీదారులు ఉన్నారు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.