బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగలగా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఈ 10 మంది కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ముందుగా ఒకరి చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేలా చేసి.. ఆ తర్వాత దానిని డిఫెండ్ చేసుకోమని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా ఈ పాస్ అర్జున్ చేతికి వచ్చినా తను యావర్ చేతిలో ఓడిపోయాడు. యావర్ మాత్రం అందరి దగ్గర ఈ పాస్‌ను బాగా డిఫెండ్ చేసుకొని చివరి వరకు కాపాడుకొని దానిని సొంతం చేసుకున్నాడు. కానీ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పిన తర్వాత యావర్ ఆడిన ఆటల్లో ఫౌల్స్ బయటపడ్డాయి. దీంతో ఆ పాస్ తనకు వద్దని స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశాడు యావర్. దీని వల్ల ఇతర హౌజ్‌మేట్స్‌కు మంచే జరిగింది. ఈవారం ఎలిమినేషన్ రద్దు అయ్యింది. కానీ వచ్చేవారం జరిగే ట్విస్ట్ గురించి మాత్రం బయటపెట్టారు నాగార్జున.
ఎలిమినేషన్ లేదు..
నేడు (నవంబర్ 19న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరిగా అశ్విని, గౌతమ్.. డేంజర్ జోన్‌లో మిగిలారు. వారిద్దరినీ ఒక బాక్స్‌లో చేయి పెట్టమన్నారు. అందులో ఎవరి చేతికి గ్రీన్ కలర్ అంటుకుంటుందో వారు సేఫ్ అని, మిగతావారు ఎలిమినేట్ అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో శివాజీ.. అర్జున్ చెవిలో ఏదో చెప్పారు. అదేంటో అందరికీ చెప్పమని అర్జున్‌ను నాగార్జున అడిగారు. అయితే గౌతమ్ ఎలిమినేట్ అవుతాడని శివాజీ అంచనా వేసినట్టు అర్జున్ బయటపెట్టారు. కానీ చూసేసరికి అశ్విని, గౌతమ్.. ఇద్దరి చేతికి గ్రీన్ కలరే అంటుకుంది. యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వద్దని ఇచ్చేశాడు కాబట్టి హౌజ్‌మేట్స్ అందరికీ ఆ పాస్ వర్తిస్తుందని, ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున ప్రకటించారు.
వచ్చేవారం ఉల్టా పుల్టా..
ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది కచ్చితంగా ఉంటుందని, దానికోసం హౌజ్‌మేట్స్ మళ్లీ పోటీపడవలసి వస్తుందని నాగార్జున బయటపెట్టారు. కానీ పోటీ ఎప్పుడు, ఎలా జరుగుతుందో బిగ్ బాస్ వివరిస్తారని సస్పెన్స్‌లో పెట్టారు. అయితే ఈవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా నాగార్జున తెలిపారు. దీంతో అప్పుడే వచ్చేవారం జరిగే డబుల్ ఎలిమినేషన్ గురించి కంటెస్టెంట్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈవారం ప్రియాంక.. కెప్టెన్సీని సాధించింది కాబట్టి వచ్చేవారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతుంది. దీన్నిబట్టి తను డబుల్ ఎలిమినేషన్ నుండి కూడా తప్పించుకుంటుంది.
లేడీ కంటెస్టెంట్స్‌పై నెగిటివిటీ..
ప్రస్తుతం లేడీ కంటెస్టెంట్స్ పట్లే బిగ్ బాస్ ప్రేక్షకులలో ఎక్కువగా నెగిటివ్ అభిప్రాయం ఉంది. అశ్విని కూడా ఈవారం డేంజర్ జోన్ వరకు వచ్చి, ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది. ఇక శోభా శెట్టికి అయితే ముందు నుండే పలువురు ప్రేక్షకులను హేటర్స్‌గా మార్చుకుంది. అనవసరంగా అరవడం, తనే కరెక్ట్ అనుకోవడం, అవసరం లేని విషయాలకు వాదించడం.. ఇలాంటి లక్షణాల వల్ల శోభా పట్ల ప్రేక్షకుల్లో అసహనం ఏర్పడింది. ఇప్పటికే శోభా ఎలిమినేట్ అవుతుంది అని చాలామంది అనుకున్నా.. తన గేమ్ ఇష్టపడే మరికొందరు తనకు ఓట్లు వేసి ముందుకు నడిపిస్తున్నారు. ఇక రతిక కూడా కమ్ బ్యాక్ ఇచ్చినప్పటి నుండి పెద్దగా గేమ్ ఏమీ ఆడడం లేదని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారు. మరి ఈ లేడీ కంటెస్టెంట్స్ నుండి వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ హౌజ్‌ను ఎవరు వదిలి వెళ్లిపోతారో చూడాలి.
Also Read: యావర్‌ది సేఫ్ గేమ్ అన్న రతిక, శోభాను ఫ్రెండ్ అంటూ కొత్త స్ట్రాటజీ!