Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో కూల్ అని ట్యాగ్ ఇవ్వగల కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని తెలుగు బిగ్ బాస్ సీజన్స్‌లో ఫైనల్ వీక్ దగ్గర పడుతుంది అనగానే.. కంటెస్టెంట్స్ అంతా మనస్పర్థలు మర్చిపోయి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించేవారు. కానీ ఈసారి అలా కాదు. ఫన్ టాస్క్ అనే పేరుతో బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు టాస్కులు ఇస్తున్నా కూడా ఒక్కరు కూడా వాటిని ఫన్‌లాగా తీసుకోలేదు. వీక్ మొత్తం టాస్కులు విషయంలో ఒకరితో ఒకరు గొడవపడుతూనే ఉన్నారు. అందుకే కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మాట్లాడారు నాగార్జున. అలాగే అమర్‌దీప్, ప్రశాంత్‌లను పిలిచి వారి మధ్య జరిగిన గొడవ గురించి చర్చించారు.


శివాజీ సేవకుడివా..?
ముందుగా ప్రశాంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. చెప్పండి సార్ మీకు ఏ వీడియో చూపించమంటారు అని వ్యంగ్యంగా అడిగారు. దీంతో ప్రశాంత్‌కు ఏం మాట్లాడాలో తెలియక ఏడుపు మొహం పెట్టాడు. ముందుగా పూల్ టాస్కులో తను ప్రియాంక కంటే ముందే పుల్‌లో దూకానని, ఔట్ అవ్వలేదని డౌట్‌తో అప్పుడే బిగ్ బాస్‌ను వీడియో చూపించమని అడిగాడు ప్రశాంత్. దీంతో తన అనుమానం తీర్చడం కోసం నాగార్జున ఆ వీడియో చూపించారు. అందులో ప్రియాంకనే ముందుగా పూల్‌లో దూకినట్టుగా కనిపించింది. అది చూసిన ప్రశాంత్‌ సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే బిగ్ బాస్ వీడియోలను చూపించరని.. ఆయనకు చూపించాలి అనిపించినప్పుడే చూపిస్తారని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.


ఆ తర్వాత బాల్స్ టాస్క్‌లో అమర్‌దీప్ నిజంగా కొరికాడా అని ప్రశ్నించారు. ‘‘కొరికాడు కొంచెం ఉబ్బంది, రక్తం కూడా వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు’’ అని ప్రశాంత్ వివరించాడు. అయితే తాను డాక్టర్లను కనుక్కున్నానని, తనకు ఇచ్చింది పెయిన్ కిల్లర్స్ మాత్రమే అని నాగార్జున తెలిపారు. సాక్ష్యంగా ఉన్న అర్జున్‌ను పిలిచి ప్రశాంత్‌ను అమర్ ఎలా కొరికాడు అని అడగగా.. మామూలుగానే కొరికాడని, పంటిగాటు కనిపించింది కానీ కాసేపటికే పోయిందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అమర్ చేసింది తప్పే అయినా కూడా అనవసరంగా ఆ విషయాన్ని పెద్దగా చూపించడానికి ప్రయత్నించాడని ప్రశాంత్‌పై కోప్పడ్డారు నాగ్. అంతే కాకుండా హౌజ్ కోసం వచ్చిన కాఫీని సైలెంట్‌గా తీసుకెళ్లి శివాజీకి ఇవ్వడం గురించి కూడా సీరియస్ అయ్యారు. ‘‘నువ్వేమైనా శివాజీ సేవకుడివా? గులామ్‌వా?’’ అని అడిగారు. ఇప్పటినుండి అయినా సొంతంగా గేమ్ ఆడమని సలహా ఇచ్చారు.


పిచ్చి నా కొడుకు అనుకుంటారు..
ప్రశాంత్ దగ్గర క్లారిటీ తీసుకున్న నాగార్జున.. తను వెళ్లిపోయాక అమర్‌దీప్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. ముందుగా బాల్స్ టాస్కులో ప్రశాంత్‌పై అమర్ ప్రవర్తన గురించి కోప్పడ్డారు. ఇక కెప్టెన్‌గా తను చేసిన ఒక తప్పును తనకే చూపించారు. ఒకరోజు కిచెన్‌లో యావర్‌కు చపాతీ ఎలా కావాలి అని అడిగిన అమర్.. అందరూ వెళ్లిపోయిన తర్వాత నూనె వేసిన చపాతీ, వేయని చపాతీ అన్నీ కలిపేసి.. ‘‘ఇప్పుడు ఎలా తినరో చూస్తాను’’ అని అన్నాడు. ఆ సమయంలో ప్రియాంక అక్కడే ఉంది.


అయితే కెప్టెన్‌గా అలా చేయడం కరెక్ట్ కాదు అని ఒకవేళ యావర్‌ను చపాతీ ఎలా కావాలి అని అడగకుండా అలా చేసుంటే అది వేరే విషయం కానీ తనను అడిగిన తర్వాత అలా చేయడం తప్పు అని అన్నారు నాగార్జున. ప్రియాంకను పిలిచి ఇదే విషయం అడగగా.. తను కూడా తప్పు అనే చెప్పింది. ఇక ప్రశాంత్ పట్ల అమర్ ప్రవర్తన కూడా తప్పు అని నాగార్జున అన్నారు. ‘‘బయట ప్రేక్షకులు నీ ప్రవర్తన చూసి సైకో అనుకుంటున్నారు. అంతలా అరవాల్సిన అవసరం లేదు. అరిచినందుకు నీ గొంతు కూడా పోయింది. ఇంకొకసారి ఇలాగే ప్రవర్తించే నిజంగానే పిచ్చి నా కొడుకు అనుకుంటారు’’ అని స్పష్టంగా తన ప్రవర్తన మార్చుకోమని అమర్‌కు వివరించారు నాగ్.


Also Read: అందరు ఆడపిల్లలకు నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!