Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా రేసులో ఏ కంటెస్టెంట్ ఎలా పాల్గొన్నారో ఇంతకు ముందు విడుదలైన ప్రోమోల్లో నాగార్జున మాట్లాడారు. ఇక తాజాగా విడుదలయిన ప్రోమోలో అమర్‌దీప్ (Amardeep) ఆట గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అమర్ ఊహించని సర్‌ప్రైజ్‌ను తనకు అందించారు. అందరి ఆట గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత వారితో ఒక టాస్క్ ఆడించారు. తమ తోటి కంటెస్టెంట్స్‌లో మార్చుకోవాల్సిన విషయాలకు సంబంధించిన పుస్తకాలను వారికి అందించి, వారికే ఎందుకు ఇచ్చారో చెప్పమన్నారు. అలా చెప్పే క్రమంలో గౌతమ్‌కు, శివాజీకి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. ఆ సమయంలో శివాజీకే నాగార్జున సపోర్ట్ చేసినట్టు ప్రోమో చూస్తే అనిపిస్తోంది.


1200 స్కోర్ సాధించినందుకు అమర్‌కు గిఫ్ట్..
ముందుగా నాగార్జునతో మాట్లాడడానికి అమర్ లేచి నిలబడగా.. ‘‘నేను పిలవలేదు ఇంకా’’ అని అన్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత ‘‘ఎవరిని ఎక్కడ బ్లాక్‌బెయిల్ చేసి పాయింట్స్ తీసుకోవాలో తీసుకున్నావు. ఎక్కడెక్కడ ఫౌల్ ఆడి ముందుకు వెళ్లాలో వెళ్లిపోయావు’’ అంటూ అమర్ ఆట గురించి స్పష్టంగా వివరించారు నాగ్. దానికి ‘‘కావాలని చేసింది కాదు’’ అంటూ అమర్ తనను తాను సమర్థించుకోబోయాడు. ఆ మాట విని ‘‘అది మన తప్పు కాదు. సంచాలకుల తప్పు’’ అని శోభాను ఉద్దేశించి అన్నారు. ఈ విషయం అమర్‌కు కూడా అర్థమయ్యి శోభావైపు చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. ‘‘నీకు వచ్చిన ఈ 1200 స్కోర్ కోసం వచ్చేవారం నువ్వే హౌజ్‌కు కెప్టెన్’’ అని నాగార్జున ప్రకటించగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ‘‘వీఐపీ రూమ్ కూడా ఉంటుంది’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో షాక్‌లో నోరు తెరిచి నిలబడిపోయాడు అమర్. ‘‘కానీ శోభా, ప్రియాంక డిప్యూటీలు కాదు’’ అని కండీషన్ పెట్టారు. నాగార్జున అన్న ఆ ఒక్కమాటతో ముగ్గురు వద్దు, వద్దు అంటూ తలూపారు. ఆ తర్వాత అమర్‌దీప్ కోసం వచ్చిన కెప్టెన్ బ్యాడ్జ్‌ను అర్జున్ తనకు అందించాడు. 


పుస్తకాలు డెడికేట్..
హౌజ్‌మేట్స్‌తో మాట్లాడడం పూర్తయిన తర్వాత ‘‘అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్‌కు పేర్లు కూడా ఉన్నాయి. అది ఈ హౌజ్‌లో ఎవరికైనా డెడికేట్ చేయాలి’’ అని వారు ఆడబోయే టాస్క్ గురించి నాగార్జున వివరించారు. ముందుగా శోభా వచ్చి ‘సోలోగా ఆడడం ఎలా?’’ అనే బుక్‌ను ప్రియాంకకు ఇచ్చింది. ఇక ప్రియాంకనేమో ‘బ్రెయిన్ వాడి ఆడడం ఎలా?’ అనే బుక్‌ను యావర్‌కు డెడికేట్ చేసింది. ఆ తర్వాత అమర్ వచ్చి ‘సరైన కారణాలతో నామినేట్ చేయడం ఎలా?’ అనే బుక్‌కు ప్రశాంత్‌కు అందించాడు. ఇక అర్జున్.. ‘ఎక్స్‌ట్రాలు ఆపడం ఎలా?’ అనే పుస్తకాన్ని అమర్‌కు డెడికేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శివాజీ.. ‘కుల్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?’ అనే పుస్తకాన్ని గౌతమ్‌కు అందించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. 


శివాజీ, గౌతమ్‌ల గొడవ..
‘‘ఏ కారణం లేకుండా మొదటి వీక్‌లో ఆరోజు మీరు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతీసారి వాళ్లిద్దరికే సపోర్ట్ చేస్తాడు అని అంటుంటాడు. నేను చెప్పానా నీకు సపోర్ట్ చేస్తాను అని. వాళ్లకు చేయను అని. ప్రతీవారం నామినేషన్‌లో అదే ఉంటుందా?’’ అంటూ గౌతమ్‌కు ఆ పుస్తకం ఇవ్వడం వెనుక కారణం గురించి వివరించాడు శివాజీ. ‘‘ప్రశాంత్, యావర్ ఏమైనా తప్పు చేస్తే మీరు నామినేట్ చేసి చెప్పరు. వేరేవాళ్లు చేస్తే అదే పాయింట్‌పై నామినేట్ చేస్తారు’’ అని గౌతమ్ ఆరోపించాడు. అయితే యావర్‌ను శివాజీ ఎందుకు నామినేట్ చేయాలి అని నాగార్జున అడిగారు. ‘‘నామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది తప్పు అలా అనొద్దు అని అయినా చెప్పాలి’’ అని గౌతమ్ అన్నాడు. ‘‘ప్రియాంక ఎప్పుడైనా శోభాను, అమర్‌ను నామినేట్ చేసిందా?’’ అని ప్రశ్నించారు నాగ్. లేదు అని సమాధానమిచ్చాడు గౌతమ్. ‘‘మరి ఈ ఫీలింగ్ ప్రియాంక గురించి ఎందుకు కలగలేదు’’ అని నాగార్జున అడగగా.. గౌతమ్‌ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయాడు.



Also Read: అమర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు - నాగార్జున ముందే నిజాన్ని బయటపెట్టిన ప్రియాంక


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply