Bigg Boss Telugu Today Promo : పాపం దివ్వెల మాధురి.. బిగ్‌బాస్‌కి వెళ్లి పస్తులు ఉండాల్సి వస్తోంది, గుంజీలు తీయాల్సి వస్తోంది
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ డే 54కి సంబంధించి మొదటి ప్రోమో విడుదల చేశారు. దానిలో దివ్వెల మాధురి కష్టాలే ఫన్నీగా చూపించారు. ఇంతకీ ఏమైందంటే..

Bigg Boss Bharani Sreeja Re Entry Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 డే 54 ప్రోమో వచ్చింది. దీనిలో దివ్వెల మాధురిని హైలెట్ చేశాడు బిగ్‌బాస్. ఎసోంటి ఎసోంటి పనులు చేసే మాధురికి.. ఇప్పుడు బిగ్‌బాస్ హోజ్లో కష్టాలు తప్పట్లేదు. అందుకే ఆమె గురించిన స్పెషల్ ప్రోమో వేశాడు బిగ్‌బాస్. మరి శ్రీజ, భరణిల టాస్క్ పరిస్థితి ఏంటి? బిగ్‌బాస్ ఇంట్లో దివ్వెల మాధురి పడుతోన్న కష్టాలు ఏంటి? ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. గార్డెన్ ఏరియాలో..
బిగ్‌బాస్ ప్రోమో స్టార్టింగ్‌లో ఆల్ ఇండియా రేడియో ప్రసారం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించేలా స్టార్ట్ చేశాడు. దివ్వెల మాధురి సోపాపై పడుకొని ఉండగా.. శ్రీజ వెళ్లి అమ్మ లేవాలి.. లేవాలి అంటోంది. అప్పుడే కుక్కరు అరుస్తాయి. లోపలి నుంచి ఇమ్మాన్యుయేల్ వస్తాడు. ఆలోపే నేను పడుకున్నాను అని చెప్తే బాగోదు అంటూ రాముకి వార్నింగ్ ఇస్తుంది. ఎవరు అంటే ఏమో అంటుంది. 20 గుంజీలు తీయమంటూ ఇమ్మూ చెప్తాడు. పాపం ఆమె కూడా గుంజీలు తీస్తుంది.
పాపం దివ్వెల మాధురి..
వాష్‌రూమ్‌లో తనవంతు కోసం వెయిట్ చేస్తూ.. మాధురి మళ్లీ పడుకుంటుంది. కుక్కలు మొరుగుతాయి. మళ్లీ ఎవర్రా బాబు అనుకుంటూ ఇమ్మాన్యుయేల్ లోపలికి వస్తాడు. ఏమో అంటే.. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది అని చెప్తాడు ఇమ్మూ. గంట నుంచి ఆమె బాత్రూమ్ నుంచి రావట్లేదు ఏమి చేయాలి అంటే.. అయితే నిద్రపోతావా అంటూ ఇమ్మూ అడుగుతాడు. ఆమె పడుకోకుండా ఇమ్మూ అక్కడే ఉంటాడు. ఎందుకు బిగ్‌బాస్ కుక్కల సౌండ్లు, ఏ కోకిల సౌండ్స్ మంచివి పెట్టొచ్చుగా అని అడుగుతుంది మాధురి. దానికి ఇమ్మూ.. అవి వింటూ ఇంకా పడుకోవడానికా అంటూ కామెడీ చేస్తాడు.
బెడ్ రూమ్‌లో కూడా దొరికిపోయిన మాధురి..
ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లి మళ్లీ పడుకొని పోతుంది మాధురి. మళ్లీ బిగ్‌బాస్ కుక్కల అరుపులు వేస్తాడు. నిద్రలేచి.. ఇమ్మూ వచ్చేసరికి కూర్చొంటుంది. ఇగో ఇక్కడున్నవాళ్లు అంతా చెప్తున్నారు నువ్వే పడుకున్నావని అనగా.. ఏయ్ నిఖిల్ నేను పడుకున్నానా అంటే.. హా అని నవ్వేస్తాడు నిఖిల్. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపిస్తాడు ఇమ్మూ. అసలే నిన్న ఎపిసోడ్లో కోపంతో ఫుడ్ తినడం మానేసింది దివ్వెల మాధురి. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో ఈమెకి అంటూ మీమ్స్ ఫన్నీగా వేస్తున్నారు.
శ్రీజ, భరణిలకు ముందు ఉన్న బాక్స్‌ల్లో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఉందని.. మీరు వారి దగ్గరికి వెళ్లమని చెప్తాడు బిగ్‌బాస్. అయితే బాక్స్‌లను బద్దలకొట్టి ఫ్రేమ్‌లను స్టాండ్స్‌పై పెట్టాలంటూ టాస్క్ ఇచ్చాడు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. లైవ్ ప్రకారం భరణి ఇంట్లోనే ఉన్నాడు. శ్రీజ కూడా మళ్లీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు.






















