Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ సీజన్ 9 భరణి vs శ్రీజ ప్రోమో.. టాస్క్‌లో సత్తా చూపించిన పవన్, గెలిచింది ఎవరంటే
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ సీజన్ 9 డే 52 ప్రోమో వచ్చేసింది. శ్రీజ, భరణి రీ ఎంట్రీ కోసం బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టాడు. వాళ్ల ఎఫర్ట్స్ చూస్తే మెచ్చుకోవాల్సిందే.

Bigg Boss Bharani, Sreeja Re Entry Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 డే 52 ప్రోమో స్టార్ మా విడుదల చేసింది. ఇంటినుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ ఇంట్లోకి వచ్చేందుకు ఈ వారం టాస్క్‌లు పెట్టాడు బిగ్‌బాస్. భరణి, శ్రీజ.. వీరిద్దరిలో ఒకరు మళ్లీ ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పాడు. దీనికోసం ఇంట్లోని సభ్యులకు టాస్క్‌లు పెట్టాడు. మరి ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు. టాస్క్‌ల్లో గెలిచింది ఎవరు? ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. భరణి, శ్రీజ.. మీరు ఎలిమినేట్ అయినా ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. కానీ మీలో ఒక్కరు మాత్రమే ఈ ఇంట్లో ఉండబోతున్నారంటూ చెప్పిన బిగ్‌బాస్ డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. పర్మినెంట్ హోజ్మేట్స్గా మారాలనుకుంటున్న సభ్యులు ఇంట్లో ఉన్న సభ్యులను మీ సైన్యంగా చేసుకోవాలంటూ రెండు గ్రూపులుగా విడగొట్టాడు బిగ్‌బాస్. అంటే దీనిలో భరణికి ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్లు ఒకవైపు.. శ్రీజకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్లు మరో వైపు వెళ్తారు. అయితే భరణి, శ్రీజ కంటెస్టెంట్లను రిక్వెస్ట్ చేసి.. తమవైపు రమ్మని అడగవచ్చు. వారి తరపున టాస్కుల్లో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మొదటి టాస్క్‌లో డిమోన్ పవన్ సూపర్..
దీనిలో భాగంగా బిగ్‌బాస్ కట్టు.. పడగొట్టు అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భరణి టీమ్‌లో ఇమ్మాన్యుయేల్, నిఖిల్ ఉండగా.. శ్రీజ టీమ్‌లో పవన్, గౌరవ్ ఆడారు. అటు ముగ్గురు ఇటు ముగ్గురు కలిసి మధ్యలో ఉన్న బాక్స్‌లలో బ్లాక్స్ పెట్టాల్సి ఉంటుంది. వాటిని ఏడు ఫ్లోర్లగా అమర్చాలి. మరో టీమ్ వారివి పడగొడుతూ తమ బ్లాక్స్ నిలబెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్‌లో శ్రీజ తరపున ఆడిన పవన్ ప్రోమోలో హైలెట్‌గా నిలిచాడు. భరణిని, ఇమ్మూన్యుయేల్ని, నిఖిల్‌ని ఆపడంలో.. టాస్క్ ఆడడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. అలాగే టాస్క్‌లో అందరూ మంచి ఎఫర్ట్స్ పెట్టారు.
గేమ్ ఆడుతున్నప్పుడు బజర్ మోగింది. అయితే శ్రీజ బ్లాక్‌లో అంటే రెండ్ బాక్స్‌లో ఉన్న ఫ్లోర్లు చివర్లో నెట్టగా. అది బాక్స్ ఎడ్జ్ టచ్ అయి ఉంది కానీ ఎక్కువ ఉన్నాయి. అలాగే భరణి బాక్స్‌లో ఒకటి మాత్రమే ఉంది. కానీ అది బాక్స్‌లో ఉంది. అయితే వీరిద్దరిలో ఎవరు గెలిచారనేదానిపై ఇంట్లో గొడవలు జరిగాయి. అందరూ తాము సపోర్ట్ చేసిన వాళ్లే గెలిచారంటూ డిబెట్స్ చేయడంతో ప్రోమో ముగిసింది. ఎవరు గెలిచారో.. ఎపిసోడ్లో తెలియనుంది.






















