Bigg Boss Telugu Today Promo : తనూజ vs ఇమ్మాన్యుయేల్.. భరణి వెళ్లాక బంధాల నుంచి బయట పడుతోన్న కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో తనూజ, ఇమ్మూ మధ్య ఓ క్యూట్ ట్రాక్ ఇన్ని రోజులు నడించింది. కానీ ఈసారి మాటల యుద్ధమే నడిచింది.

Bigg Boss Thanuja vs Emmanuel Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 44వ రోజుకు చేరుకుంది. సోమవారం అంతా నామినేషన్స్ రచ్చ జరగ్గా.. మంగళవారం కూడా నామినేషన్స్‌కి తర్వాత జరిగిన రచ్చనే కొనసాగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా. కళ్యాణ్ మోసం చేయడంతో తనూజకు ఇమ్మాన్యుయేల్‌కు మధ్య గట్టిగా గొడవ జరిగింది. దాని గురించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మరి ఈ ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ సీజన్ 8 లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్‌లో సీజన్ రచ్చ బాగా జరుగుతుంది. ఇన్ని రోజులు జంటగా కలిసి ఉన్న తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య గొడవ జరిగింది. ప్రోమోలో ఏమి ఉందంటే.. వాడు (కళ్యాణ్) నామినేట్ చేయలేదు అనిసి లేచి వాయిస్ రైజ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని దివ్యకు చెప్తుంది. నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అనేసరికి ఇమ్మాన్యుయేల్ వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నో డా.. నువ్వు మాట్లాడకు అంటుంది. దీంతో ఇమ్మూ.. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయి అన్నాడు అందుకే ఇచ్చాను అంటూ దివ్యకి చెప్తాడు.
తనూజ నన్ను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరికీ ఇచ్చాడు అంటూ అడిగేసరికి.. ఈ వారం నా నామినేషన్స్ పాయింట్ నీ మీదనే ఉంది. అందుకే ఇచ్చాను అంటూ ఇమ్మాన్యుయేల్ చెప్తాడు. అదే చెప్పాల్సింది అని తనూజ అడిగితే.. అదేగా చెప్పాను ఇప్పుడు అంటూ ఇమ్మూ రిప్లై ఇచ్చాడు. నాకు సేఫ్ గేమ్ అనిపించిదంటూ ఇమ్మూ అనేసరికి.. నీది కూడా నాకు సేఫ్ గేమ్ అనిపిస్తుందని చెప్తుంది తనూజ. దానికి చేయి మరి నన్ను నామినేట్ చేయి అంటూ అడిగాడు ఇమ్మూ. అయితే గత ఆరువారాలుగా ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు. దీంతో అతని ఓట్ బ్యాంక్‌పై చాలా చర్చలు ఆడియన్స్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఆలోచించే.. ఇమ్మూ ఇలా చేస్తున్నాడన్నట్లుగా ప్రోమో ఉంది.
ఇలాంటి వ్యక్తినా నేను సపోర్చ్ చేసింది..
దివ్యతో.. తినకి రమ్యని చేయాలని.. రమ్యకి తినని చేయాలని ఉంది. ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పార్షయాలిటీ చూపించినట్లు ఉంటుంది. అందుకే ఇచ్చాను అని ఇమ్మూ చెప్తాడు. వాళ్లు వాళ్లు చూసుకుంటారు కదా నాకేంటి అంటాడు. అది విన్న తనూజ సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కొడితే ఇమ్ము కూడా అదే రిపీట్ చేస్తాడు. గో అహెడ్ ఇమ్మాన్యుయేల్ అనగా.. గో అహెడ్ తనూజ అంటాడు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను అని బాధేసింది అనేసరికి ఎవరూ ఎవరికోసం నిలబడలేదని తనూజా అంటుంది.
గతంలో తనూజ గేమ్ కోసం సపోర్ట్ కావాలంటూ వచ్చవని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటూ ఇమ్మూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దగా మారింది. ప్రోమో కూడా ఎండ్ అయింది. అయితే ఇప్పుడు హోజ్లో కెప్టెన్సీ గురించిన టాస్క్‌లు నడుస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రోమోలు రావాల్సి ఉంది. పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.






















