(Source: ECI | ABP NEWS)
Bigg Boss Telugu Today Promo : సుమన్ శెట్టికి కోపం కూడా వస్తాదా? శెట్టి అన్నను టాస్క్‌లో ముంచేసిన ఫ్లోరా!?
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ సీజన్ 9 ఈరోజు ప్రోమో వచ్చేసింది. టాస్కులో ఫ్లోరాపై సుమన్ శెట్టి అరిచేశాడు. ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో చూసేద్దాం.

Bigg Boss Telugu 9 Day 33 Promo : బిగ్‌బాస్‌లో డేంజర్లో ఉన్న సభ్యులకు టాస్క్ జరుగుతుంది. వైల్డ్ కార్డ్ వస్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ టాస్కులే ప్రధానమంటూ చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే టాస్కులు పెడుతున్నాడు. అయితే డేంజర్ జోన్ నుంచి కొందరిని తప్పించి మిగిలినవారికి టాస్క్‌లు పెట్టాడు బిగ్‌బాస్. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. అయితే ఈ ప్రోమోలో సుమన్ శెట్టికి కోపం వచ్చి.. ఫ్లోరాపై ఫైర్ అవుతున్నాడు. అసలు ఏమి టాస్క్ జరిగింది? సుమన్ శెట్టికి కోపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో
బిగ్‌బాస్‌లో డేంజర్ జోన్‌ని నుంచి తప్పించుకునేందుకు జరుగుతున్న టాస్క్‌లు చివరిదశకు వచ్చేశాయి. అయితే దీనిలో భాగంగా చివరిగా మరొక్క అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. డేంజర్ జోన్లో ఉన్నవారికి ఫైర్ స్ట్రామ్ నుంచి సేవ్ అవ్వడానికి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. Fight For Survival అనే టాస్క్ పెడుతున్నట్లు చెప్పాడు. నీటితో నిండే పూల్స్ ఉన్నాయి. ఏ పూల్‌లో ఎవరు పడుకోవాలనేది సేవ్ అయిన కంటెస్టెంట్లు నిర్ణయించాలని సూచించాడు బిగ్‌బాస్. ఎప్పుడైతే పూల్‌లో ఉన్న సభ్యులు.. ఇక పూల్‌లో ఉండలేము అనుకుంటారో.. వాళ్లు పూల్‌లో లేచి కూర్చోవచ్చు. అలా లేచి కూర్చొన్నవారు ఎలిమినేట్ అవుతారంటూ టాస్క్ గురించి వివరించాడు.
భరణి మీద ఇమ్మూకి కోపం వచ్చిందిగా..
సీజన్ మొదటి నుంచి మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్న భరణిపై ఇమ్మూకి కోపం వచ్చింది. టాస్క్‌లో భాగంగా పూల్‌లో ఎవరు ఉండాలనే టాస్క్ గురించి సేఫ్ జోన్లో ఉన్నవారి మధ్య డిస్కషన్ జరిగింది. భరణి రీతూ, తనూజలపై కాన్సంట్రేట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీనిలో భాగంగా ఇమ్మూని నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటే.. మమ్మీ వచ్చి అడిగిందని చెప్తాడు. దీంతో భరణి డిజప్పాయింట్ అవుతాడు. ఇమ్మూ అదే విషయం రీతూ వాళ్లతో చెప్తూ అసహనం వ్యక్తం చేశాడు.
ఫ్లోరాపై అరిచేసిన సుమన్ శెట్టి? తప్పు ఎవరిది?
మొత్తానికి టాస్కులో డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రీతూ, శ్రీజ, తనూజ, సంజన పాల్గొంటారు. మిగిలిన వాళ్లు తాము సపోర్ట్ చేయాలనుకున్న వారి పూల్‌లోని వాటర్ వేరే వాటిలో పోస్తూ ఉంటారు. ఇదిలా జరుగుతుండగా ఫ్లోరా శక్తి అన్న ఎలిమినేటడ్ అంటుంది. సపోర్ట్ తీసుకుంటున్నారంటూ చెప్తుంది. దీంతో సుమన్.. నో సిస్టర్ అంటూ చెప్తాడు. నేను చూశానండి అని చెప్పడంతో సీరియస్ అవుతాడు. నేను ఏమైనా పొడుగ్గా ఉన్నానా? ఎందుకు టచ్ అవుతాది.. నేను తప్పు చేయలేదు అంటూ అరవడంతో ప్రోమో ముగిసింది.






















