‘బిగ్ బాస్’లో ఎప్పుడైనా సండే అంటేనే ఫన్‌డే. సండే రోజు వారమంతా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, మనస్పర్థలు మర్చిపోయేలా వారితో ఫన్ యాక్టివిటీలు చేయిస్తారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో ఇది మొదటి ఫన్‌డే కావడంతో ఇప్పటివరకు కంటెస్టెంట్స్ మధ్య ఉన్న మనస్పర్థలు అన్నీ తొలగిపోయే ఒక యాక్టివిటీతో మన ముందుకు వచ్చారు. ప్రతీ ఒక్క కంటెస్టెంట్.. ఇతర కంటెస్టెంట్స్‌తో ఉన్న ఒక బెస్ట్ మెమోరీని, ఒక మర్చిపోవాలనుకుంటున్న మెమోరీని షేర్ చేసుకోమన్నారు. ఆ క్రమంలోనే టేస్టీ తేజకు షకీలా దగ్గర నుంచి గట్టి వార్నింగ్ పడింది.


టేస్టీ తేజ, షకీలా కామెడీ..
షకీలా.. శివాజీ చెప్పిన మాటలు విని కంటెస్టెంట్స్ అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. నిద్రపోనివ్వకుండా చేశారు. ఆ క్రమంలో తేజ చాలా భయపడ్డాడు. అయితే షకీలాతో తనకు మర్చిపోవాలని ఉన్న మెమొరీ అది ఒకటే అని టేస్టీ తేజ తనను డిస్‌లైక్‌లో నిలబెట్టాడు. అప్పుడు ‘ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే వీడికి కూడా ఎలుకల మందు ఇస్తాను’ అన్నారు షకీలా. శివాజీ ఫన్ టాస్క్ ఇస్తే తను చేశానని, అయినా అందరూ తననే అంటున్నారు అని చెప్పింది. తేజ.. అదేమీ పట్టించుకోకుండా లైక్‌లో శోభా శెట్టిని నిలబెట్టాడు. ‘నేను శోభా శెట్టిని బయట నుంచి కూడా ఫాలో అవుతున్నాను. హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు. శోభా కూడా తేజనే లైక్‌లో నిలబెట్టి ‘తనకు ఇంట్లో వాళ్లు తప్పా ఎవరూ తినిపించలేదని, తేజ తనకు తినిపించడం చాలా స్పెషల్’ అని చెప్పింది. 


మనస్పర్థలు తొలగిపోయాయి..
ఈ లైక్, డిస్‌లైక్ గేమ్ వల్ల చాలామంది కంటెస్టెంట్స్.. ఫ్రెండ్స్ అయిపోయారు అన్న భావన ప్రేక్షకులకు కలిగింది. ప్రియాంక కూడా లైక్, డిస్‌లైక్.. రెండిటిలో దామినినే నిలబెట్టింది. ముందుగా తను మాట్లాడిన ఓక మాటను తప్పుగా అర్థం చేసుకొని దామిని.. తనతో గొడవపెట్టుకుంది. కానీ ఆ గొడవ గురించి మాట్లాడుకొని క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారని, కేవలం కళ్లతోనే మాట్లాడుకుంటున్నారని చెప్పింది ప్రియాంక. శుభశ్రీ అయితే అందరి మంచి గురించి ఆలోచిస్తాడు, అలాగే నా మంచి గురించి కూడా ఆలోచించాడు అంటూ అమర్‌దీప్‌ను లైక్‌లో నిలబెట్టింది. ఇక శోభా శెట్టితో ఉన్న మనస్ఫర్థల కారణంగా తనను డిస్‌లైక్‌లో నిలబెట్టింది.


అమర్‌దీప్‌కు సలహాలు..
ఈ యాక్టివిటీలో లైక్, డిస్‌లైక్‌తో పాటు కొందరు కంటెస్టెంట్స్.. ఇతర కంటెస్టెంట్స్ గేమ్ గురించి కూడా సలహాలు ఇచ్చారు. అమర్‌దీప్ ఆట గురించి కూడా శివాజీ సలహా ఇచ్చారు. అమర్‌దీప్ వేరేవాళ్లను గేమ్ ఆడేలా చేయాలనుకుంటున్నాడు కానీ తను గేమ్ ఆడడం లేదని శివాజీ అన్నారు. ఇదే విషయం అమర్‌దీప్ మనసులో బలంగా ఉండిపోవడంతో.. గౌతమ్ కృష్ణతో చర్చించాడు. అసలు నేను ఆడడం లేదా అని ప్రశ్నించాడు. తనను వీక్ కంటెస్టెంట్‌గా చూస్తున్నాడని అన్నాడు. దానికి సమాధానంగా గౌతమ్ కృష్ణ.. స్ట్రాంగ్‌గా ఆడు అంటూ అమర్‌దీప్‌కు సలహా ఇచ్చాడు. లైక్, డిస్‌లైక్ గేమ్ మధ్యమధ్యలో నామినేషన్స్ నుంచి ఎవరెవరు సేఫ్ అవుతున్నారు అనే విషయాన్ని ప్రకటిస్తూ వచ్చారు నాగార్జున. అలా చివరిగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు.


Also Read: సందీప్‌కు షాకిచ్చిన నాగార్జున - ఆ తప్పు చేశావంటూ పవర్ అస్త్ర వెనక్కి!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial