Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బిగ్‌బాస్ ఏం పీకలేరా.. రోహిత్ గెట్ అవుట్.. నాగ్ ఫైర్! 3 ఎల్లో కార్డ్స్! ఇలాంటి రోజు మళ్లీ రాకూడదు!
Bigg Boss Season 10 Today Episode: నాగ్ కంటెస్టంట్స్ మీద ఫుల్ ఫైర్ అయి 3ఎల్లో కార్డులు ఇవ్వడం రోహిత్‌ని ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10.. రోజు రోజుకీ మంచి మంచి ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు అక్టోబరు 3వ తేదీ బిగ్‌బాస్ మొదలై 27వ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ వాష్‌రూంలో బట్టలు ఉతకడం ఏంటి.. 
అదిరిపోయే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగ్ రావడం రావడమే ఆడియన్స్‌తో మాట్లాడుతారు. తర్వాత శుక్రవారం జరిగినది చూస్తారు. వర్షిణి మైక్ లేకుండా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటంతో బిగ్‌బాస్ మైక్ వేసుకోమనడం వర్షిణి సైగలు చేయడం కామెడీగా ఉంటుంది. ఇక అపూర్వ కెప్టెన్ గదిలో ఉన్న వాష్రూంకి వెళ్లి బట్టలు ఉతకడం త్రిగుణ్ వాళ్లకి లేటు అవ్వడంతో ఎమర్జెన్సీకి ఆ గది వాడాలి కదా గంటలు గంటలు చేస్తే ఎలా అని త్రిగుణ్ గొడవ పడతాడు. తర్వాత ఇంటి సభ్యులు స్టార్ హెల్త్ ప్రమోషన్ గేమ్ ఆడుతారు. గేమ్ తర్వాత అపూర్వ కెప్టెన్‌కి వెళ్లి సంజాయిషీ ఇస్తుంది.
అదిరిపోయే స్కిట్..
కెప్టెన్ వర్షిణి ఫోన్‌పే గోల్డ్ కాయిన్స్ అమన్‌కి ఒకటి సృష్టికి రెండు ఇస్తుంది. ఇక రాంప్రసాద్, వంశీ, నరేశ్, సృష్టిలు కాలేజ్ సీనియర్స్‌లా ముకేశ్, వర్షిణి.. రోహిత్, షాలిని లవర్స్ అని వాళ్లతో సీనియర్స్ ఆడుకున్నట్లు స్కిట్ చేస్తారు. సీన్స్ కామెడీగా ఉంటాయి. తర్వాత కంటెస్టెంట్ డాజ్లర్ ప్రమోషన్ గేమ్ ఆడుతారు. అందరూ అందంగా రెడీ అయి ర్యాంప్ వాక్ చేస్తారు. ఈ గేమ్‌లో నరేశ్, దేబ్జానీ, సృష్టి, త్రిగుణ్ విన్ అవుతారు.
నాగ్ ఫైర్.. 
నాగ్ రావడం రావడంతో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే చరణ్‌ని సీక్రెట్ గదికి పిలిచి రోహిత్‌కి తనకి మధ్య జరిగిన ఓ వీడియో మ్యూట్‌లో చూపించిస్తారు. ఏమైంది అని అంటే అది బూతు సార్ చెప్పలేను అని చరణ్ సారీ చెప్తాడు.
ముగ్గురు బయటకు రండి.. 
నాగ్ చరణ్‌ని లోపలికి పంపేసి రోహిత్, త్రిగుణ్, అమన్‌ని గార్డెన్ ఏరియాకి పంపిస్తారు. తర్వాత వర్షిణికి కెప్టెన్ అయినందుకు కంగ్రాట్ చెప్తారు. పవర్ ఎవరైనా వాడమని చెప్పారా అని త్రిగుణ్ గురించి చెప్తారు. తర్వాత అపూర్వని లేపి కెప్టెన్‌గా నీకు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పావ్ మరి నువ్వేం చేశావ్.. కెప్టెన్సీ గదిలో డ్రాగర్లు దాయడం కరెక్టేనా.. బయట నుంచి వచ్చి కామనర్స్ అందరికీ బయట నుంచి చూసి చెప్పావ్.. కదా చెప్పొద్దు అన్నా ఎందుకు చెప్పావ్.. అని నిలదీస్తారు. నువ్వు డిజాస్టర్ కెప్టెన్.. ఈ మాట చెప్పా అని ఏడ్వకు.. దేబ్జానీకి బలం కావాలి అంటే ఏం తినాలి అని అడిగావ్ కదా.. అని తిడతారు.
రాంప్రసాద్ నువ్వు పిస్తావా.. 
రాంప్రసాద్‌ని లేపి నువ్వే ఏమైనా పిస్తా అనుకున్నావా.. నామినేషన్ గురించి మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడుతున్నావ్.. ఇందుకే నీకు కన్నింగ్ అని చెప్పేది అని అంటారు. తర్వాత రాంప్రసాద్ నిత్యం పడుకుంటూ ఉండే వీడియో చూపించి ఇదే నువ్వు చేస్తుంది అని అంటారు. దానికి రాంప్రసాద్ తనకి యాక్సిడెంట్ అయింది అందుకే మెడ, నడుం నొప్పి వస్తుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అని అంటాడు. అందరికీ చెప్తే నీకు సపోర్ట్ చేస్తారు జాగ్రత్తగా ఉంటారు కదా అని నాగ్ అంటే నా వీక్ నెస్ చెప్పడం ఇష్టం లేదు అని రాంప్రసాద్ అంటే అది వీక్ నెస్ కాదు అని నాగ్ అంటారు.
షాలిని వాట్ ద ఎఫ్..
నాగ్ షాలినిని నిల్చొపెట్టి షాలిని అన్న F అనే బూతు గురించి మాట్లాడుతారు. ఎడిటింగ్‌లో కట్ అయిపోతుంది అనుకున్నావా అని కోప్పడతారు. షాలిని సారీ చెప్తుంది. ఇలాంటివి ఆడియన్స్ చూస్తే మిమల్ని పంపేస్తారు అని చెప్తారు. తర్వాత షాలిని అన్నింటికి పెద్ద పెద్దగా అరుస్తుంది అని చెప్పి.. ఆట తీరు మార్చుకో అని చెప్తారు.
రోహిత్‌కి ఏం చెప్పాలి అనుకున్నావ్.. 
అపూర్వని నాగ్ లేపి షాలిని, సృష్టిలను చూసి నువ్వేం అనుకున్నావ్.. రోహిత్‌కి ఏం చెప్పాలి అనుకున్నావ్ అని అడిగి అపూర్వ మిస్ అండర్ స్టాండ్ వల్ల జరిగిన గొడవ వీడియో వేసి చూపిస్తారు. తర్వాత రోహిత్, షాలిని మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ వెళ్తే షాలిని వెళ్లిపోమని చెప్పడం గురించి అడిగి షాలిని, రోహిత్‌కి గొడవ పెట్టాలని చూశావా అని అడుగుతారు. గేమ్ పాజ్‌లో ఉంటే ఎందుకు షాలిని మీదకు పంపావ్ అని అడుగుతారు. ఇక షాలినిని నిలబెట్టి నువ్వు రోహిత్ మాట్లాడుతూ ఉంటే తనని వెళ్లిపోమన్నావ్ వెళ్లిపోతే మళ్లీ ఎందుకు రెచ్చగొట్టావ్ అని అడుగుతారు. తర్వాత అపూర్వతో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఏదీ ఊహించుకొని ఎవరి మీదకు పంపకు అని అంటారు.
అమన్ ఎల్లో కార్డు నీకే..
అమన్‌ని లివింగ్ రూంకి పిలిచి ఈ వారం నువ్వు ఆట ఎలా ఆడావ్ అని అడుగుతారు. అమన్ వివరించగానే అంతేనా.. అని వెంటనే ఎల్లో కార్డు చూపించి ఇంకోసారి నువ్వు ఒక్క తప్పు చేసినా వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతావ్.. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అని అంటారు. వీడియోలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తారు. ఝాన్సీని నిలబెట్టి అమన్ చేసింది కరెక్టేనా అంటే తప్పు మాటలు మాట్లాడాడు అని అమన్‌ది తప్పు అని అంటుంది. త్రిగుణ్ కోపంలో కూడా కంట్రోల్ చేసుకున్నా సరే నువ్వు మాత్రం మాటలు వదిలేశావ్.. అని కోప్పడతారు. ఇక ఝాన్సీతో అమన్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశావ్ సూపర్ అని బాగా ఆడుతున్నావ్ అని మెచ్చుకుంటారు. ఇక అమన్ ఆట బాగుంది అని మెచ్చుకుంటారు.
ముకేశ్ దాన్ని మెంటైన్ చేస్తున్నావా.. 
నాగ్ ముకేశ్‌ని లేపి ఏంటి నువ్వు దాన్ని మెంటైన్ చేస్తున్నావా అని రోహిత్‌ని ముకేశ్ కెప్టెన్సీ కోసం అన్న విషయం చెప్తారు. ముకేశ్ అపూర్వని ఉద్దేశించి రోహిత్‌ని అన్న విషయం గురించి అడుగుతారు. దానికి ముకేశ్ నేను కెప్టెన్సీ కోసం అన్నా తన కోసం అనలేదు అంటాడు. దాంతో నాగ్ వీడియో చూపిస్తారు. తర్వాత నాగ్ దేబ్జానీని అడిగితే అది చూడటానికి అమ్మాయిని అన్నట్లు ఉంది కానీ ముకేశ్ అలాంటి వాడు కాదు అని అంటుంది. తర్వాత చిన్నదో వైపు పెద్దదో వైపు అని ట్రయాంగిల్ అన్న విషయం గురించి వీడియో చూపించి ప్రశ్నిస్తారు. ముకేశ్‌కి పనిష్మెంట్ ఏం ఇద్దాం అని నాగ్ వర్షిణికి అడిగితే అందరికీ సారీ చెప్పాలి అంటుంది. ముకేశ్ అందరికీ సారీ చెప్తాడు. ఈ వారం నీ ఆట బాగుంది ఎంత బాగుందో తెలుసా నీ కాళ్లు మొక్కే అంత బాగుంది అన్నంత బాగుంది అంటాడు. ఆ విషయం కావాలి అంటే పర్సనల్‌గా కెప్టెన్ వర్షిణితో మాట్లాడు అని నరేశ్‌కి నాగ్ చెప్తారు.
మీ ఆట బాగుంది.. 
నాగ్ దేబ్జానీ నీ ఆట బాగుంది అని చెప్తారు. దేబ్జానీతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతారు. తర్వాత చీట్ చేశావ్ అన్నారు కానీ వాళ్ల అనుకున్న దానిలో చీట్ చేయలేదు కానీ ఇంకో విషయంలో సంచాలక్ చీట్ చేశాడు అని దేబ్జానీకి సైగ చేసిన వీడియో చూపిస్తారు. తర్వాత నరేశ్, వంశీల ఆట బాగుంది అని చెప్తారు. తర్వాత సృష్టి, సుధీర్ చాలా ఇంప్రూవ్ అయ్యారని మెచ్చుకుంటారు. సుధీర్ ఇమ్యునిటీ సాధించావ్ ఇది రియల్ ఫ్రీడమ్ అని అంటారు. చరణ్ ఆట అస్సలు కనిపించడం లేదు అని అంటారు.
త్రిగుణ్ ఇది అస్సలు బాలేదు.. 
త్రిగుణ్‌ని పిలిచి మాట్లాడుతారు. త్రిగుణ్ ఓ మాట వచ్చింది కానీ ఆపుకున్నా కానీ ఆ ఆలోచన రావడం కూడా తప్పే అంటాడు. నాగ్ వీడియో చూపించి నీ నుంచి ఇది ఊహించలేదు అని అంటారు. తర్వాత త్రిగుణ్ రోహిత్ మీదకు వెళ్లి ఆడంగి వెనక వెళ్లడం.. యాక్ తూ అని ఉమ్మడం.. అన్నీ చూపిస్తారు. షాలినిని అడిగితే ఇద్దరిదీ తప్ప అని అంటుంది. త్రిగుణ్ షాలినిని కాపాడాలని వెళ్లావ్ కానీ తనే నిన్ను రాంగ్ అని చెప్తుంది.. త్రిగుణ్ మైండ్ గేమ్ ఆడుతాడు.. అని నీ మీద చాలా హోప్స్ ఆడియన్స్‌లో ఉండే కానీ నువ్వు ఇలా చేయడం తప్పు అనుకుంటారు. ఇది నీ ఇల్లు కాదు.. నీకు నచ్చినట్లు ఉండటం కాదు.. అని త్రిగుణ్‌కి కూడా నాగ్ పసుపు రంగు కార్డ్ చూపించి చివరి వార్నింగ్ అని అంటారు.
రోహిత్ బయటకు వెళ్లిపో.. 
నాగ్ ఇంటి తలుపులు ఓపెన్ చేయిస్తారు. ఇంటి సభ్యులు అందరూ బిగ్‌బాస్‌కి మర్యాద ఇవ్వాల్సిందే.. షో మీద కానీ బిగ్‌బాస్ మీద కానీ తప్పుగా ప్రవర్తించే వాళ్లని నేను భరించను అని చెప్పి వెంటనే చరణ్, రోహిత్ మధ్య జరిగిన సంభాషణకి చెందిన వీడియో చూపిస్తారు. అందులో రోహిత్ చరణ్‌తో సైలెంట్‌గా బూతులు మాట్లాడి.. జుట్టు పీకినట్లు చూపిస్తాడు. బిగ్‌బాస్ నన్ను ఏం పీకలేడు అదే కదా నీ ఉద్దేశం అని నాగ్ అంటారు. అందరూ రోహిత్‌ది తప్పు అని అంటారు. ఆడియన్స్‌ని కూడా అడిగితే రోహిత్ బిగ్‌బాస్ కోసమే అన్నాడు అని అందరూ చేతులెత్తుతారు. ఇలాంటి వాళ్లని నా హౌస్ భరించలేదు ఇంటి నుంచి వెళ్లిపో అని అంటారు. దాంతో రోహిత్ దండం పెట్టి క్షమాపణలు చెప్తాడు. నాగ్ ఇంటి నుంచి వెళ్లిపోమని అంటే ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయను.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడుతా.. బిగ్‌బాస్, ఆడియన్స్ అందరూ నన్ను క్షమించండి అని అంటాడు. ఇక నాగ్ రోహిత్‌కి ఎల్లోకార్డు చూపిస్తారు. ఇది ఫైనల్ వార్నింగ్ ఇచ్చి డోర్స్ క్లోజ్ చేయించి రోహిత్‌ని పిలుస్తారు. నవ్వు పెద్ద పోటుగాడివా కొడతా అన్నావ్ వాళ్లు నిన్ను తిరిగి కొడితే అని అంటారు. తర్వాత రోహిత్ సృష్టి చేయి నొప్పి అంటున్నా రోహిత్ డ్రమ్ తన్నేసిన వీడియో చూపించి చాలా రాంగ్ ఆ మాత్రం కన్సర్న్ లేదా అని అడుగుతారు. రోహిత్ చాలా తప్పు చేశాడు అని హౌస్మేట్స్ అందరూ అనుకుంటారు. ఆటలో ఉన్మాదం వద్దు అని నాగ్ అంటారు. ఇలాంటి రోజు మళ్లీ రాకూడదు అని నాగ్ అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















