Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్! రోహిత్, త్రిగుణ్, అమన్‌లకు ఎల్లో కార్డ్?
Bigg Boss Season 10 October 2nd Promo 2: రోహిత్, త్రిగున్, అమన్‌లను నాగ్ బయటకు పంపేయడం.. అపూర్వని డిజాస్టర్ కెప్టెన్ అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ రెండో ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Promo 2: బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్ డామినేషన్ చివరి రోజుకి వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో వీక్ ఎండ్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది.. నాగ్ ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులను తుక్కు రేగొట్టనున్నారు. ఈ వారం ఇంటి సభ్యులు లైన్ క్రాస్ చేసి మాటలు విసురుకోవడం.. కొట్టుకోవడానికి వెళ్లడం.. బూతులు తిట్టుకోవడం విపరీతంగా చేశారు. ఈ ఇష్యూలన్నీ నాగ్ వీడియోలతో సహా చూపించి కంటెస్ట్ంట్స్‌ని కడిగేయనున్నారు. ఇంట్లో ముగ్గురు కంటెస్టెంట్స్‌కి ఎల్లో కార్డు ఇచ్చినట్లు తెలుస్తుంది. అమ్మాయిలు.. అబ్బాయిలు అని తేడా లేకుండా చీవాట్లు పెట్టారు.. అపూర్వని డిజాస్టర్ కెప్టెన్ అని తిట్టారు.. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని బీబీ టీం విడుదల చేసింది. కంటెస్టెంట్స్‌ని చెమటలు పట్టించేసిన ఈ ప్రోమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రోమోలో ఉంది ఇదే..
బిగ్‌బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా కంటెస్టెంట్స్‌కి నాగ్ ఎంట్రీ ఇచ్చిన ప్రోమో వచ్చేసింది.. ప్రోమో ప్రారంభంలోనే కెప్టెన్‌గా ఉన్న అపూర్వని మష్రూం గదిలో ముకేశ్, త్రిగుణ్ సైటెర్లు వేసి ఉడికించడం, డ్రాగర్స్ కోసం ఇంటి సభ్యులు కొట్టుకోవడం.. ఓవర్ అగ్రసివ్ అవ్వడం.. డ్రమ్స్ గేమ్‌లో సృష్టి తన చేయి ఇరుక్కుంది అని అరుస్తున్నా రోహిత్ పట్టించుకోకుండా డ్రమ్ తన్నడం.. అన్నీ చూపిస్తారు. నాగ్ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే చాలా సీరియస్‌గా వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్ అని అడుగుతారు. కంటెస్టెంట్స్ అందరూ నోరెళ్ల బెడతారు. మీరు ఇంటి సభ్యులా వీధిలో ఉండే రౌడీలా అంటూ ఇంగ్లీష్‌లో ఆర్‌యూ హౌస్ మేట్స్ ఆర్ హూలీగన్స్ ఇన్ ది స్రీట్ అని అడుగుతారు. వెంటనే అమన్, రోహిత్, త్రిగుణ్‌లను లివింగ్ ఏరియా వదిలేసి గార్డెన్‌లోకి రమ్మని పిలుస్తారు. తర్వాత అపూర్వతో కెప్టెన్ అపూర్వ.. అపూర్వ గారు.. కెప్టెన్ రూం నువ్వు వాడిన విధానం కరెక్టా? నువ్వు ఇంటి మొత్తానికి కెప్టెన్ కేవలం రెడ్ టీంకి మాత్రమే కాదు.. నాకు రెస్పెక్ట్ కావాలి నన్ను కెప్టెన్ అపూర్వ అని పిలవాలి అని గట్టిగా చెప్పావ్ కదా.. అంతే గట్టిగా.. కెప్టెన్ రూం వాడకూడదు.. ఇది కరెక్ట్ కాదు.. అన్‌ఫైర్ అని ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తారు. నువ్వు ఓ డిజాస్టర్ కెప్టెన్ అని అపూర్వ చెంప మీద కొట్టినట్లు చెప్తారు.
రాంప్రసాద్ నువ్వు ఏమైనా పిస్తావా.. లాస్ట్ టైం చెప్పాను.. నామినేషన్స్ గురించి మాట్లాడొద్దు.. డిస్కషన్ పెట్టొద్దు అని చెప్పినా కూడా ఎందుకు డిస్కషన్ పెట్టావ్ అందుకే నిన్ను కన్నింగ్ అని అన్నది అని నాగ్ అంటారు. తర్వాత షాలినిని లేపి షాలిని వాట్ ద F ఈజ్ హ్యాపెనింగ్ అని అడుగుతారు. సార్ అప్పుడు అని షాలిని చెప్పబోతే కోపం వచ్చింది.. చిరాకు వేసింది.. అని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా.. మీరు మీ ప్రవర్తన ఇలా ఉంటే నోటికొచ్చినట్లు వాగితే ఆడియన్స్ కూడా మీరు ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు అని చెప్తారు. దీంతో ఇవాళ్టి ప్రోమో పూర్తయిపోతుంది.
రోహిత్, త్రిగుణ్, అమన్‌లు నోటికొచ్చినట్లు మాట్లాడి.. కొట్టుకునే వరకు వెళ్లడంతో నాగ్ రావడం రావడమే వాళ్లని గార్డెన్ ఏరియాకు పిలిచారు. ముగ్గురికీ ఫైనల్ వార్నింగ్‌గా ఎల్లో కార్డు ఇచ్చినట్లు తెలుస్తుంది. ముగ్గురు నాగ్‌కి క్షమాపణలు చెప్పి ఇంకోసారి రిపీట్ చేయమని వేడుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















