Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 93 రివ్యూ... తాను తీసుకున్న గోతిలోనే పడ్డ సంజన... ఇమ్మూని ఆడియన్స్ అడిగిన క్రేజీ ప్రశ్నలు ఇవే
Bigg Boss 9 Telugu Today Episode - Day 93 Review : ఇమ్మాన్యుయేల్ ప్రభంజనం నడిచింది ఈరోజు కూడా. నేటి టాస్క్ లోనూ ఫస్ట్ వచ్చి, హయ్యెస్ట్ స్కోర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఓటు అప్పీల్ ను దక్కించుకున్నాడు.

92వ రోజు రాత్రి 10.30 గంటలకు సంజనాకు బిగ్ బాస్ 3 సార్లు డిఫరెంట్ రీజన్స్ చెప్పి జైలు నుంచి బయటకు రావాలనే సీక్రెట్ టాస్క్ ను ఇచ్చి, లైట్స్ ఆఫ్ అయ్యేలోపు ఆ టాస్క్ పూర్తి చేస్తే లీడర్ బోర్డులో 20 పాయింట్స్ ఇస్తానని చెప్పారు బిగ్ బాస్. వాష్ రూమ్, గ్యాస్ట్రిక్, వామిటింగ్ అనే సాకులతో సంజన సీక్రెట్ టాస్క్ ను కంప్లీట్ చేసింది. తరువాత సంజనను జైలు నుంచి రిలీజ్ చేశారు.
ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్
బిగ్ బాస్ ఇచ్చిన రెండవ టాస్క్ 'వీల్ బ్యారెల్'. ఇందులో వీల్ పై పాట్స్ పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ, జర్నీలో అవాంతరాలను దాటుకుని, పెడల్స్ పై ఒక్కోటి పెట్టుకొంటూ వెళ్ళాలి. ఈ టాస్క్ లో గెలిచి 100 పాయింట్లు సంపాదించాడు ఇమ్మానుయేల్. రెండు టాస్కులలో కలిపి ఇమ్ముకు 150, డెమోన్ పవన్ 120, సుమన్ 90, తనూజా 90, భరణి 90, సంజన 80 పాయింట్స్ తో ఉన్నారు లీడర్ బోర్డులో.
"మీరు చేస్తున్న పోరాటం ఇది ఫెయిర్ కాదని మీకు ముందే తెలుసు. తరువాత జరిగే యుద్ధంలో పాల్గొనకుండా జీరో తెచ్చుకునే ఒక కంటెస్టెంట్ పేరును చెప్పాలి" అని బిగ్ బాస్ ఆదేశించారు. "నన్ను నిన్న కూడా దూరం పెట్టారు. ఆ ట్రామాను తట్టుకోలేను" అని సంజన, "లీడర్ బోర్డులో టాప్ లో ఉన్నాను అని తీయొద్దు" అని ఇమ్మూ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇక్కడే మొదలైంది తనూజా సంజన గొడవ. "నువ్వు 80 పాయింట్స్ తో లీస్ట్ లో ఉన్నావు. 90 ఉన్నవాళ్ళు తీసేస్తే ఒకరిని దాటి ముందుకు వెళ్తావ్ కదా. 150 ఉన్నవాళ్ళను తీసేస్తే వాళ్ళు టాప్ లోకి వెళ్తారు. నువ్వు డెమోన్ కు ఓటేస్తే పోయేది నేనే" అని స్ట్రాటజీ చెప్పాడు ఇమ్మూ. సంజన అర్థం చేసుకోలేదు. తనూజా వెళ్ళి "మీరు భరణిని తీసేయమన్నారా?" అని ఇమ్మూని అడిగింది.
"సంజన గారు నేను భరణి.అన్నని తీసేయమన్నానా? మీరలా మాట్లాడకండి. ఒక ముగ్గురు మా పేరు చెబితే, మేము భరణి లేదా సుమన్ పేరు చెబితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావ్? అని అడిగా అంతే" నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తా అన్నా. మీరు ముగ్గురూ నన్ను తీసేద్దాం అన్నారట కదా?" అని ఇమ్మూ ఫైర్ అయ్యాడు. "ఎవరిని తప్పిస్తున్నారు" అని బిగ్ బాస్ అడగ్గా... సుమన్, భరణి, తనూజా ఇమ్మూ పేరు చెప్పారు. సంజన డెమోన్ పేరు చెప్పి తరువాత పరిస్థితిని బట్టి ఇమ్మూ పేరు మార్చుకుంది. "డెమోన్ పేరు చెప్పి వెంటనే ఇమ్మూ అని పేరు మార్చారు. మాటిచ్చారు అంటే.. అక్కడ కూర్చున్నప్పుడు ఇమ్మూనీ తీయను అన్నారు. ఇప్పుడు మాట మారిస్తే నేను మారుస్తా తప్పేంటి? అని అడిగింది తనూజా. "నిన్న కూడా నన్ను జీరో పెట్టావు. నీ ఇన్నర్ మెంటాలిటీ, బయట మెంటాలిటీ వేరు. నేను నిన్న కూడా బలయ్యాను. కాబట్టి నావల్ల కావట్లేదు. అల్టిమేట్ గా నన్ను టార్గెట్ చేసి, తీసేయడమే నీ ఆలోచన" అంటూ సంజన మండిపడింది.
"నిమిషానికో మాట మాట్లాడొద్దు. ఆ మాట అక్కడే చెప్పొచ్చు కదా" అని తనూజా ఫైర్ అయ్యింది. "నిన్న డెమోన్ నన్ను సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను డెమోన్ ను తియ్యాలి అనుకున్నా" అని సంజన అనగానే.. "అదే కదా పర్సనల్" అని కళ్యాణ్ వచ్చాడు. "ఇమ్మూ నా ఫ్రెండ్ కాబట్టి ఇమ్మూకి సపోర్ట్ చేస్తా" అని తనూజా అంది. దీంతో ఇమ్మూ "నువ్వా నేనా అంటే నువ్వని చెప్తా" అని చేతులు ఎత్తేశాడు. "నువ్వు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేయలేదు" అని ఎమోషనల్ అయ్యింది సంజన. "నీ ఓటును వేస్ట్ చేసుకోవద్దు అని నెత్తినోరు కొట్టుకున్నా. విన్నావా నువ్వు" అని ఇమ్మూ సీరియస్ అయ్యాడు. సంజనాకు 4 ఓట్లు రావడంతో ఆమెను సెకండ్ గేమ్ నుంచి కూడా తీసేశారు. టాప్ 2లో ఉన్న సభ్యులు ప్రేక్షకులను ఎదుర్కోబోతున్నారు అంటూ ఇమ్ము, డెమోన్ ను గార్డెన్ ఏరియాకు పంపారు. ప్రేక్షకులు ఇమ్మూకి ఓటు అప్పీల్ కోరుకునే ఛాన్స్ ఇచ్చారు.
1. కప్పు గెలవగానే గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? అమ్మ దగ్గరగా?
ఇమ్మూ : అమ్మ దగ్గరకే వెళ్ళి చేతిలో పెడతా. ఇక్కడ ఫ్యామిలీ వాల్యూ చాలా తెలిసింది. కప్పు అమ్మకు, సాధించాను నీకోసం.అని సక్సెస్.ను తన చేతిలో పెడతా.
2. గేమ్ బాగా ఆడుతున్నారు. అందుకే జుట్టు బాగా ఊడిపోయింది. తనూజా అంటే ఎందుకు సాఫ్ట్ కార్నర్ ?
ఇమ్మూ : టెనెంట్ గా ఉన్నపుడు తనతో జెన్యూన్ బాండ్ ఏర్పడింది. నేనేదో తనను సాఫ్ట్ కార్నర్ చేశాను అనుకుంది.
3. సంజనాతో మీ బాండ్ హౌస్ వరకేనా? బయట కూడానా?
ఇమ్మూ : బయట చాలా ప్లాన్ చేసుకున్నాము. అమ్మ.తప్పు చేస్తే అమ్మను వదల కదా. అదే కంటిన్యు చేస్తా.
4. ఇమ్మూ : ఈ హౌస్ లో మీ బలం ఎవరు
కామెడీ చేయడానికి అయినా సరే సంజన గారే.






















