Family week Nabeel and Rohini Mother in The House: బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం ఫ్యామిలీ ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేశారు. కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్లు ఇంట్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో నబిల్ మదర్ ఇంట్లోకి వచ్చారు. నబిల్‌కు బిగ్ బాస్ స్వీట్లు తినే ఆఫర్ ఇచ్చాడు. ఇకపై ఇంట్లో స్వీట్లు తినొచ్చని చెప్పాడు. నబిల్ మదర్ ఇంట్లోకి వచ్చే టైంకి నబిల్‌ను స్వీట్లు తినేందుకు పిలిచాడు. ఆ తరువాత కాసేపటి తన తల్లి వద్దకు నబిల్‌ను పంపించాడు బిగ్ బాస్. అందరితో బాగా ఉండు.. నీ ఆట నువ్వు ఆడుకో అని ఎంతో స్పోర్టివ్‌గా మాట్లాడేసింది.
ఇంట్లోంచి బయటకు వెళ్లే టైంలో నబిల్ మదర్ నుస్రత్‌కు బిగ్ బాస్ టాస్క పెట్టాడు. అందులో నుస్రత్ గెలిచి గులాబ్ జామ్‌లు నబిల్‌కు వచ్చేలా చేసింది. ఆ తరువాత నిఖిల్ గడ్డం మీద యష్మీ కౌంటర్ వేసింది. గడ్డం లేకపోతే బాగా లేవు.. పృథ్వీ బాగున్నాడు అని యష్మీ చెప్పింది. ఈ మాట విష్ణు వింటే నిన్ను చంపేస్తుంది అని నిఖిల్ కౌంటర్ వేశాడు. ఇక ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్లు వస్తున్నారని, తన అమ్మ రాకుండా బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడని తేజ వెక్కి వెక్కి ఏడ్చాడు. కావాలంటే ప్రతీ వారం నామినేట్ చేసుకో.. కానీ మా అమ్మను మాత్రం ఇంట్లోకి రానివ్వు బిగ్ బాస్ అంటూ తేజ కన్నీరు పెట్టుకున్నాడు.
వచ్చే అతిథుల్ని, నన్ను, ఆడియెన్స్‌ను ఎంటర్టైన్మెంట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో గత సీజన్లో మాదిరి పెళ్లి టాస్క్ చేశారు. అదేమీ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. రోహిణి అల్లుడు బుడ్డోడు, అమ్మ గోవిందమ్మ వచ్చింది. ఆ బుడ్డోడు అందరూ ఆడుకున్నారు. రోహిణి మదర్ అందరితో కలిసి ముచ్చటించింది. అందరూ బాగానే ఆడుతున్నారు.. అందరూ బాగున్నారు అని చెప్పింది. రోహిణికి సపరేట్‌గా కొన్ని సలహాలు ఇచ్చింది. నువ్వు అందరితో బాగానే ఉంటున్నావ్ కానీ కొందరు నీ వెనకాల మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది.
బయట ఎలా ఉంటున్నావో.. ఇక్కడ కూడా అలానే ఉంటున్నావ్.. కమెడియన్లకు కప్పు రాదని ఎందుకు ఫీల్ అవుతన్నారు.. అలా ఏం ఉండదు.. మీరు మీ ప్రయత్నం చేయండి.. అని తేజ, రోహిణిలకు సలహాలు ఇచ్చింది. ఇక బుడ్డోడితో చిన్న మామయ్య అని పిలపించుకున్నాడు తేజ. అరేయ్ అలా పలవొద్దురా అని రోహిణి అనేసింది. గౌతమ్‌కు రోహిణి లైన్ వేస్తున్న ట్రాక్ మీద కూడా ఆమె తల్లి ఫన్నీగా స్పందించింది. రోహిణి మదర్ మాత్రం ఆ ఇంట్లో ఉన్నంత సేపు చాలా ఫన్నీగా, సరదాగా నవ్వుతూనే కనిపించారు.
గత సీజన్లలో ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే ఏడ్పులు పెడబొబ్బులతో విసుగు పుట్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నబిల్ మదర్, రోహిణి తల్లి నవ్వుతూ వచ్చి.. అందరినీ నవ్వించే వెళ్లారు. ఆ తరువాత ఇంట్లో వాళ్లందరికీ ఫ్రీజ్, రిలీజ్, ఫాస్ట్ ఫార్వార్డ్ అంటూ పాత టాస్కును ఇచ్చాడు. ఆ తరువాత యష్మీ కోసం తన తండ్రి పంపిన లెటర్, ఫుడ్‌ను పంపించాడు. బుధవారం నాటి ఎపిసోడ్‌లో యష్మీ ఫాదర్ రాబోతోన్నాడని అర్థం అవుతోంది. మరి మున్ముందు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్ల రాకతో ఎపిసోడ్స్ ఎలా సాగుతాయో చూడాలి.