బిగ్ బాస్ సీజన్ 8 డే 24కు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేసి బిగ్ బాస్ ప్రియులకు షాక్ ఇచ్చారు. వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్ అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ ను ఇచ్చేశారు. ఈ వార్త హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను షేక్ చేయగా, బిగ్ బాస్ ప్రియులకు కూడా ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అసలు తాజా ప్రోమోలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటో చూసేద్దాం పదండి.
భూకంపం వచ్చేలా చేసిన బిగ్ బాస్
ప్రస్తుతం హౌస్ లో కాంతారా క్లాన్ చీఫ్ గా సీత, శక్తి క్లాన్ చీఫ్ గా నిఖిల్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఉదయం చూపించిన ప్రోమోలో ఈ రెండు క్లాన్లలో తమకు ఇష్టమైన క్లాన్ లోకి హౌస్ మేట్స్ అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ మధ్య నిఖిల్ టీంకు సంబంధించిన చర్చ నడిచింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి నిఖిల్, పృథ్వీ, సోనియాలను ఒంటరి చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి "బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతోంది" అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. "మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు ఈ భూకంపం" అంటూ వాళ్ళు వణికిపోయే వార్తను చెప్పారు బిగ్ బాస్. "ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు మరో రెండు వారాల్లో హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాయి" అంటూ నిజంగానే బిగ్ బాస్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ జరగని ట్విస్ట్ ను వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ ఉలిక్కి పడ్డారు.
Read Also : Bigg Boss News: బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ హీరోయిన్ల ఎంట్రీ... మహేష్ బాబు మరదలు కూడా
వైల్డ్ కార్డు ఎంట్రీ ని అడ్డుకునే అవకాశం వాళ్ళకే
అయితే తాజాగా బిగ్ బాస్ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చెప్పి షాక్ ఇవ్వడమే కాకుండా "మీ బలాబలాలు చూపించి వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపే శక్తి కూడా మీలోనే ఉంది" అంటూ కంటెస్టెంట్స్ కు ఊరటను ఇచ్చారు. "సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్" అంటూ ఏకంగా 12 టాస్కులు పెట్టబోతున్నామని వెల్లడించారు. "అందులో ఒక్కో టాస్క్ లో గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపొచ్చు. అలా వైట్ కార్డు ఎంట్రీని ఆపే కెపాసిటీ ఇంట్లో సభ్యులకు ఉంటుంది" అని బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఏడు సీజన్లు స్ట్రీమింగ్ అయినప్పటికీ ఎప్పుడూ ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు బిగ్ బాస్.
బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీజన్ 8 లో ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త బిగ్ బాస్ చరిత్రలో ఒక ప్రభంజనం లాంటిది అని చెప్పొచ్చు. అయితే వాళ్ళను ఆపే శక్తిని కూడా కంటెస్టెంట్స్ కే ఇవ్వడంతో 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను ఆపడానికి 12 ఛాలెంజ్లను హౌస్ మేట్స్ గెలవాల్సి ఉంటుంది. హౌస్ లో ప్రస్తుతం 11 మంది ఉండగా, వాళ్లు రెండు క్లాన్లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ 12 టాస్కులు ఎలా పెడతారు? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది..