నిన్నటినుంచి బిగ్ బాస్ హౌస్ లో రోల్ ప్లే టాస్క్ నడుస్తోంది. హౌస్ లో జరిగిన కొన్ని హైలైట్ సంఘటనలకు కంటెస్టెంట్స్ కి ఇచ్చి.. వేరే ఇంటి సభ్యుల్లా నటించమని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో.. వారు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పారు. నిన్న సిరి-సన్నీ అప్పడం టాస్క్ తో పాటు.. ప్రియాంక-మానస్ ల జర్నీ టాస్క్ ను ఇవ్వగా.. హౌస్ మేట్స్ వారి వారి పాత్రల్లో జీవించేశారు.
ఈరోజు కూడా ఈ రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఇందులో బిగ్ బాస్.. జెస్సీ పిండి ఫైట్ సంఘటనను రోల్ ప్లేగా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీరామ్ చపాతీలు చేయమని జెస్సీని అడిగితే.. తనకు రాదని శ్రీరామ్ తో గొడవ పెట్టుకుంటాడు జెస్సీ. దానికి శ్రీరామ్ ఎవరి వంట వాళ్లే వండుకోవాలని డైలాగ్ కొడతాడు. దీంతో సిరి-షణ్ముఖ్ రంగంలోకి దిగి శ్రీరామ్ తో వాదన పెట్టుకుంటారు. ఈ రోల్ ప్లేలో షణ్ముఖ్.. శ్రీరామ్ క్యారెక్టర్ పోషించగా.. సిరి.. జెస్సీ రోల్ ప్లే చేసింది. కాజల్.. సిరి క్యారెక్టర్ తీసుకుంది. శ్రీరామ్.. షణ్ముఖ్ పాత్ర పోషించాడు.
సన్నీ మాత్రం లాంగ్ ఫ్రాక్ వేసుకొని హమీద పాత్రలో కనిపించాడు. ఈ టాస్క్ లో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ డైలాగ్స్ చెబుతూ అప్పటి సీన్ ను రిపీట్ చేస్తుండగా.. హమీద గెటప్ లో ఉన్న సన్నీ.. 'అరే ఎందుకు ఒకడిమీద ఇలా పడిపోతారు' అంటూ హమీదను ఫన్నీగా ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఫైనల్ గా షణ్ముఖ్.. శ్రీరామ్ ని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం నవ్విస్తుంది.