Bigg Boss 6 telugu: హిట్:ద ఫస్ట్ కేస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చి హిట్ 2. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా చేశారు. డిసెంబరు 2న ఈ సినిమా విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్, మీనాక్షి బిగ్ బాస్ కు వచ్చారు. 


ఇక ప్రోమోలో ఏముందంటే... నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ రేవంత్‌ను గ్లాస్ డోర్‌పై కోడి బుర్ర అని రాసి, ఒక దెయ్యం బొమ్మ వేయమని చెప్పారు. అలా వేశాక ‘కోడి బుర్ర అని ఎవరు రాశారో చెప్పడం కోసం ఒక కూల్ కాప్ (పోలీస్) వేదిక మీదకు వస్తున్నాడు’ అని చెప్పారు. ఆ వెంటనే అడివి శేష్ వేదిక మీదకు వచ్చారు. కోడి బుర్ర అని ఎవరు రాశారో కనిపెట్టమని చెప్పారు నాగార్జున. కోడిబుర్ర అని తననే అంటున్నారా అని అడిగాడు శేష్. తరువాత ఎవరో కనిపెట్టే పనిలో పడ్డాడు. రాసే రాత చూస్తుంటే అమ్మాయిలు రాసినట్టు లేదని, అమ్మాయిలు చక్కగా రాస్తారని చెప్పాడు. రాసిన హైట్‌ను బట్టి చూస్తూ బాగా ఎత్తుగా ఉన్నవాళ్లు కాకుండా సాధారణ హైట్ ఉన్నవాళ్లే ఇది రాసుంటారని అన్నారు. మొత్తానికి ఆయన కనిపెట్టారో లేదో తెలియదు కానీ ఇంటి కంటెస్టెంట్లతో కొన్ని ఆటలు ఆడించారు. నీస్, ఫోల్డర్స్ అంటూ చిన్న పిల్లల ఆట ఆడించారు. తరువాత హీరోయిన్ మీనాక్షి కూడా వేదిక మీదకు వచ్చింది. 



ఆయనే నెంబర్ వన్?
 నిజానికి మొన్నటి వరకు శ్రీసత్యకు అందరికన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ చివరి నిమిషంలో ఓటింగ్ మారింది. ఫైమాకు అయిదు శాతం ఓట్లు పడితే, శ్రీసత్యకు ఎనిమిది శాతం ఓటింగ్ పడింది. అయితే మొన్నటి రేవంత్ ఎక్కువ శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ అనూహ్యంగా దూసుకొచ్చి మొదటి స్థానాన్ని దక్కించు కున్నాడు. రేవంత్, రోహిత్‌లలో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సు అధికంగా ఉంది.  ఇప్పటికే శ్రీహాన్ ఫైనల్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా మారాడు. టిక్కెట్ టు ఫినాలే దక్కించుకున్నాడు.  శ్రీహాన్ టాప్ 5లోకి అడుగుపెట్టేశాడు. 







Also read: ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు