Bigg Boss Telugu 7 Saturday Promo 2 : బిగ్ బాస్ రియాలిటీ షో రోజులు గడుస్తున్న కొద్దీ మాంచి మజా కలిగిస్తోంది. సీజన్ 7లో భాగంగా 69వ రోజు రెండో ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో హౌజ్​మేట్​గా ఎవరు పాస్ అయ్యారు? ఎవరు ఫెయిల్ అయ్యారు? అనేది చెప్పాలంటారు నాగార్జున. హౌస్ లోని అందరు కంటెస్టెంట్స్ బ్లాక్ బోర్డుపై పాసైన కంటెస్టెంట్ తో పాటు ఫెయిల్ అయిన కంటెస్టెంట్ పేరు రాయాలని చెప్తారు. ఈ సందర్భంగా ఏ కంటెస్టెంట్ ఎవరి గురించి ఏం చెప్పారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రోమో ప్రారంభంలో బ్లాక్ బోర్డుపై రెడ్ క్లాత్ కప్పి ఉంటుంది. అమర్ ను ఆ క్లాత్ తొలగించాలని నాగార్జున చెప్తారు. అమర్ ఆ వస్త్రాన్ని తీసేస్తాడు. హౌస్ మేట్ గా ఎవరు పాస్ అయ్యారు? ఎవరు ఫెయిల్ అయ్యారు? పాస్ అయిన వారి పేరు ఒకటి, ఫెయిల్ అయిన వారి పేరు ఒకటి రాయాలని చెప్తారు. శోభ..  అమర్ పాస్ అయ్యారని చెప్తుంది. అదే సమయంలో రతిక ఫెయిల్ అయ్యిందంటుంది. ఈ సందర్భంగా రతిక నుంచి గేమ్ చక్కగా ఆడాలనే ఎఫర్ట్స్ కనిపించడం లేదని చెప్తుంది. దానికి నాగార్జున రియాక్ట్ అవుతూ, అమర్ చేస్తే ఓకే, రతిక చేస్తే తప్పా? అని ప్రశ్నిస్తారు. శివాజీ పాస్ వైపు యావర్ పేరు, ఫెయిల్  వైపు భోలే పేరు రాస్తారు.


అర్జున్ విషయానికి వస్తే, భోలే పాస్ అయ్యాడని చెప్తాడు. అమర్ ఫెయిల్ అయినట్లు రాస్తాడు. అమర్ గెలవడానికి ఆడితే కచ్చితంగా గెలుస్తాడని చెప్తాడు. పక్కవాడు ఓడిపోవడానికి ఆడితే మాత్రం గెలవడని చెప్తాడు. ఇక అమర్ అర్జున్ పాస్ అయ్యాడని చెప్తాడు. రతిక ఫెయిల్ అయ్యిందంటాడు. రతిక భయం కారణంగానే సరిగా గేమ్ అడటం లేదంటాడు. ఆ భయాన్ని పక్కన పెడితే గెలుస్తుందని చెప్తాడు. ఇక యావర్ శివాజీ పాస్ అయ్యారని చెప్తాడు. శోభ ఫెయిల్ అంటాడు. ఇక రతిక శివాజీ పాస్ అయ్యాడని చెప్తుంది. శోభ మాత్రం ఫెయిల్ అయ్యిందని రాస్తుంది. ఇక భోలే మాత్రం ప్రశాంత్ అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు.


ఇక గౌతమ్ అర్జున్ పాస్, రతిక ఫెయిల్ అని చెప్తాడు. అందరి గేమ్ చూసి మళ్లీ హౌస్ లోకి వచ్చిన రతిక,  అందరితో పోల్చితే మంచి అడ్వాంటేజ్ లో ఉంది అంటారు. అయినా సరిగా ఆడటం లేదంటాడు. ఇక అర్జున గెలవడంతో పాటు తనను గెలిచేలా చేస్తున్నాడని చెప్తారు. ఇక ఈ వారం మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అని నాగార్జున అడుగుతారు. దానికి రతిక లేచి నిలబడటంతో ప్రోమో ఎండ్ అవుతుంది.   



Read Also: నాగార్జున సమక్షంలో కెప్టెన్సీ పంచాయతీ.. రాజమాతలు డామినేటింగ్ చేశారా? లేదా?


Read Also: వెస్ట్రన్ బీట్ ​తో తెలంగాణ ఫోక్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సాంగ్!