నిన్నటి ఆటలో చాలా చురుగ్గా ఉన్నాడు రేవంత్. అతనితో అర్జున్, రోహిత్, మెరీనా, శ్రీసత్య, సూర్య గొడవపడుతూనే కనిపించారు. కానీ ఈ ఆటలో ఫైమా, రేవంత్ చాలా బాగా ఆడారు. అందుకే వీరితో గొడవలు వచ్చాయి మిగతా వారికి. శ్రీహాన్, అర్జున్, రోహిత్ మధ్య ఆట ఫిజికల్ అయింది. ఒకరినొకరు లాక్కుని పక్కకు తోసేపుకున్నారు. శ్రీహాన్ ఆట కూడా ఎప్పటిలాగే ఈ టాస్కులో చురుగ్గా ఉంది. 

 

ఇక ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. హౌస్ లో 'డిజాస్టర్ ఎవరు..?'. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. టాస్క్ ప్రకారం.. హౌస్ మేట్స్ ఎవరినైతే డిజాస్టర్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. ముందుగా అర్జున్ కళ్యాణ్.. రేవంత్ పేరు చెప్పారు. వసంతి.. గీతూ పేరు, ఆర్జే సూర్య.. వసంతి పేరు, శ్రీహాన్.. మెరీనా పేర్లు చెప్పారు. అర్జున్.. రేవంత్ ని డిజాస్టర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. 

 

టాస్క్ మొత్తం బాగానే ఆడినప్పటికీ.. గేమ్ లో అగ్రెసివ్ అయిపోతున్నాడని.. కొన్ని సార్లు కంట్రోల్ దాటుతున్నాడని.. అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్నారని చెప్పారు. దానికి రేవంత్.. మొదటి నుంచి ఇలానే ఉన్నానని కామెంట్ చేశారు. ఇక వసంతి.. తనకంటే గీతూ తక్కువ గేమ్ ఆడిందని డైలాగ్ కొట్టగా.. వెంటనే గీతూ 'టాస్క్ అంటే ఫిజికల్ గా ఆడడం మాత్రమే కాదు. నేను ఆడింది కూడా గేమే' అని చెప్పింది. 

 

మెరీనా కూడా గీతూ డిజాస్టర్ అని చెప్పినట్లుంది. వారిద్దరి మధ్య కూడా వాదన జరిగింది. శ్రీసత్య.. రేవంత్ ని డిజాస్టర్ అని చెప్పింది. 'గేమ్ బాగానే ఆడావు. కానీ కెప్టెన్ షిప్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ను నువ్ ఫాలో అవ్వలేదు' అని చెప్పింది. రేవంత్.. వసంతిని డిజాస్టర్ అని చెబుతూ.. గేమ్ లో ఆమె రూల్స్ ఫాలో అవ్వని విషయాన్ని కారణంగా చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. 

 

గేమ్ లో ఎవరూ రూల్స్ ఫాలో అవ్వలేదని వసంతి అనగా.. అయితే అది వాళ్లతో మాట్లాడుకోండి అని రేవంత్ అన్నారు. ఆ తరువాత వసంతి ఫైర్ అయింది. 'రూల్స్ ఫాలో అవ్వని వాళ్లు నాకు చెప్తున్నారు రూల్స్ ఫాలో అవ్వమని' అంటూ కోప్పడింది. మళ్లీ రేవంత్ ఏదో అంటుంటే.. 'రూల్స్ గురించి నువ్ నాకు చెప్పు' అంటూ వెటకారంగా మాట్లాడింది వసంతి. 






 

ఈ వారం నామినేషన్లలో సూర్య, గీతూ తప్ప అందరూ ఉన్నారు. వీరిలో వీక్ గా ఉన్నవారు వాసంతి, మెరీనా. వీరిద్దరిలో ఒకరు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిద్దరూ టాస్కుల ఆడేది, మాట్లాడేది కూడా చాలా తక్కువ. మెరీనా వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆమె వెళ్లిపోయినా రోహిత్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, వారి అభిమానులు పెద్దగా బాధపడరు కూడా.