బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి ఇంటి సభ్యులందరికీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడే అవకాశం ఇచ్చారు. మొదట టాస్క్ లో గెలిచిన శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లు గా మారారు. ఇప్పుడు వాళ్ళకి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆఖరి వరకు ఆగని పరుగు పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచి ఇంటికి తాము కెప్టెన్ ఎందుకు అవాలనుకుంటున్నారో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ప్రోమో వదిలారు.


తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఇతర పోటీదారుల పూల కుండీలు తీసుకుని పరిగెట్టాలి. పరుగులో వెనకబడితే ఆ కంటెస్టెంట్‌తోపాటు పూల కుండీపై ఎవరి పేరు ఉంటుందో వారు కూడా వెనకబడినట్లే. అంటే, ఆ ఇద్దరు బయట ఉండి.. తాము ఎందుకు కెప్టెన్సీకి అర్హులనే విషయాన్ని చెప్పాలి. ఈ నేపథ్యంలో వాసంతి.. ఆది రెడ్డి పూల కుండీ పట్టుకుని వెనకబడుతుంది. ఈ సందర్భంగా ఇద్దరూ కెప్టెన్సీకి తాము ఎందుకు అర్హులనే విషయంపై చర్చించారు. 


ఈ సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ ఒకసారి నేను కెప్టెన్ అయ్యాను. నాగార్జున సర్ ఏం పీకలేకపోయావు అన్నారు.. అందుకే ఇంకో అవకాశం పీకుదామని అడుగుతున్నా అన్నాడు. ఇక గీతూ వాసంతి గురించి మాట్లాడుతూ నామినేషన్ విషయం లేవనెత్తింది. నామినేషన్స్ కి భయపడే వాళ్ళు కెప్టెన్సీకి అర్హులు కాదని గీతూ కామెంట్ చేసింది.


శ్రీ సత్య మాట్లాడుతూ తాను ఇంటికి రెండో మహిళా కెప్టెన్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పింది. మేల్, ఫిమేల్ గా కాకుండా సమానంగా ఆలోచించమని రోహిత్ అడిగాడు. ఇనయా వాసంతికి సపోర్ట్ చేస్తే ఎందుకని ఫైమా అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని ఇనయా అనేస్తుంది. దీన్ని బట్టి చూస్తే కెప్టెన్సీ టాస్క్ కాస్త హీట్ పెంచిందనే చెప్పాలి. రాజ్ మాట్లాడుతూ తనకి ఓటు వేసినా కూడా లాస్ట్ వరకు ఉంటదని గ్యారెంటీ లేదని అన్నాడు. మరి రాజ్ ఎవరి గురించి అన్నాడో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేంత వరకు ఆగాల్సిందే.


కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు


కెప్టెన్సీ కంటెండర్లుగా అయ్యే అవకాశం అందరికీ ఇచ్చారు బిగ్ బాస్. ఎమినిమి బంతులు పెట్టి వాటిని ఎవరైతే తమ బాస్కెట్లో మొదట వేస్తారో.. ఆ ఎనిమిది మంది కెప్టెన్సీ కంటెండర్లుగా మారుతారని చెప్పారు బిగ్ బాస్. బంతులు కోసం చాలా ఫైట్ చేసుకున్నారు. ముందుగా రేవంత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రాజేశేఖర్ బంతులు దక్కించుకుని తమ పేరున్న బాస్కెట్లో పెట్టారు. సూర్యకు, అర్జున్, వాసంతికి కూడా బంతులు దొరికాయి. గీతూ అయితే ఫైట్ చేయకుండా అందరి దగ్గరికి వెళ్లి బంతి ఇచ్చేయమని అడగడం మొదలుపెట్టింది. చివరికి సుదీప బంతిని దక్కించుకుని రోహిత్ బాస్కెట్లో వేసింది. దీంతో  శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. 


Also read: కీర్తికి మానస్ వాయిస్ మెసేజ్? ఇంటి సభ్యుల కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న రోహిత్