పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భీమ్లానాయక్’. మలయాళం సినిమా ‘అయ్యపన్ కోషియమ్’కు రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్, రానా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే తెలుగులో విడుదలైంది. త్వరలో హిందీలో విడుదల కాబోతోంది. ఈ మేరకు హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. నిజానికి తెలుగులో విడుదల చేసినప్పుడే, హిందీలో కూడా విడుదల చేయాలనుకున్నారు కానీ వీలు కాలేదు. దీంతో కాస్త ఆలస్యంగా బాలీవుడ్లో విడుదల చేస్తున్నారు. ఇది ఏ మేరకు హిందీ ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి. 


తెలుగు సినిమాలు హిందీలో విడుదల చేయడం ఈ మధ్య అలవాటుగా మారింది. బాహుబలితో మొదలైన ట్రెండ్ ఇప్పుడు భీమ్లానాయక్ దాకా వచ్చింది. పుష్ప సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ ఖిలాడి సినిమా కూడా హిందీలో విడుదల చేశారు. తెలుగు కథలకు, హీరోలకు బాలీవుడ్లో ఆదరణ లభిస్తుండడంతో ఇలా పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. బాహుబలి తరువాత ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయివే. తెలుగుతో పాటూ హిందీలో కూడా విడుదలయ్యాయి. 








మొదట్లో భీమ్లానాయక్ సినిమాను బాలయ్యతో రీమేక్ చేస్తారనే వార్తలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని ఆ నందమూరి హీరోతోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకు కుదరలేదు. చివరికి పవన్ కళ్యాణ్ హీరోగా చేశారు.