Ugly Story Telugu Movie: 'చిన్నారి పెళ్లికూతురు'గా తెలుగు బుల్లితెర వీక్షకుల ముందుకు వచ్చిన ఉత్తరాది అమ్మాయి అవికా గోర్. ఆ సీరియల్‌లో బాల నటిగా మెప్పించారు. తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మధ్యలో కొంత విరామం వచ్చినప్పటికీ... ఇప్పుడు తెలుగు మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. 


అగ్లీ స్టోరీ... ఓ రొమాంటిక్ థ్రిల్లర్! 
అవికా గోర్... నిర్మాత బెక్కం వేణుగోపాల్ (Bekkam Venugopal)కు చెందిన లక్కీ మీడియా సంస్థది సూపర్ హిట్ కాంబినేషన్! 'సినిమా చూపిస్త మావ' వాళ్ళిద్దరి కలయికలో వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 'సినిమా చూపిస్త మావ' కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ అయితే... ఇప్పుడు చేయబోయే సినిమా రొమాంటిక్ థ్రిల్లర్!


అవికా గోర్ ప్రధాన పాత్రలో రియా జియా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి లక్కీ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ' (Ugly Story Telugu Film). ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో యువ హీరో నందు (Nandu Actor) జోడీగా అవికా గోర్ కనిపిస్తారు. ఈ సినిమాతో ప్రణవ స్వరూప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 


ఫిబ్రవరి 2024లో సినిమా విడుదల!
లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ''ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పా. ఈ కథలో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఈ రోజు టైటిల్ లాంఛ్ చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పారు.


Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!






దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ ''వేణుగోపాల్ గారు 'సినిమా చూపిస్త మావ', 'మేం వయసుకు వచ్చాం', 'హుషారు' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేశారు. నా తొలి సినిమా ఆయన సంస్థలో చేయడం సంతోషంగా ఉంది. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఆయన నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టం'' అని అన్నారు.


Also Read మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?


 


నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు డిజైన్స్: విక్రమ్ డిజైన్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శీలం రామకృష్ణ, సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్ - వరికుప్పల యాదగిరి - కడలి, కళా దర్శకుడు : విఠల్ కొసనం, కూర్పు: శ్రీకాంత్ పట్నాయక్ .ఆర్, ఛాయాగ్రహణం: శ్రీ సాయి కుమార్ దారా, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రాజ్ - అశ్వనీ శ్రీ కృష్ణ, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్ - సిహెచ్. సుభాషిణి - కొండా లక్ష్మణ్, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: ప్రణవ స్వరూప్.