బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ(Anasuya).. ఇప్పుడు నటిగా కూడా బిజీ అయ్యారు. 'రంగస్థలం'(Rangasthalam), 'పుష్ప'(Pushpa) లాంటి సినిమాలు నటిగా ఆమె స్థాయిని పెంచాయి. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోపక్క లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి.
సినిమాలు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు అనసూయ. సినిమాలతో బిజీ అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక రీసెంట్ గా ఆమె 'జబర్దస్త్'(Jabardasth) షో నుంచి తప్పుకున్నారు. సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఆమెపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్లు ఆమె టార్గెట్ చేస్తుంటారు. తనపై వచ్చే విమర్శలపై అంతే ధీటుగా స్పందిస్తుంటారు అనసూయ.
తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఇండస్ట్రీ గురించి, జబర్దస్త్ షో గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. 'జబర్దస్త్' షో నుంచి తప్పుకోవడానికి చాలానే కారణాలున్నాయని చెప్పారు. రేసిజం, బాడీ షేమింగ్ లపై జోక్స్ వేస్తే తనకు నచ్చదని.. కచ్చితంగా రియాక్ట్ అవుతానని.. అదే 'జబర్దస్త్' షో విషయం వచ్చేసరికి రియాక్ట్ కాలేకపోవడంతో జనాలకు నా క్యారెక్టర్ అర్ధం కావడం లేదని.. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుందని తెలిపారు. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అలానే సినిమాల కారణంగా ఒక్కోసారి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని.. అది కూడా ఓ కారణమని చెప్పారు.
ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితో గిల్లించుకోవాలి:
ఇండస్ట్రీలో ఆడవాళ్ల రోల్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు అనసూయ. 'ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే కెమెరా ముందు కాపాడండి అని అనాలి, లేదంటే సిగ్గుపడి నవ్వాలి.. అంతవరకే.. అసలు మాట్లాడకూడదు. హీరోయిన్స్ అంటే అందరివాళ్లు అన్నట్లు.. దేవదాసిలాగా. 'పోకిరి'(Pokiri) సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా.. గిల్లితే గిల్లించుకోవాలని.. ఇండస్ట్రీలో ఆడవాళ్ల పరిస్థితి కూడా అంతే. మన హక్కుల కోసం మాట్లాడితే మనపై ఇంట్రెస్ట్ పోతుంది. మీలాగే మేము కూడా కష్టపడి పని చేస్తున్నాం. మా జీతాలు మేం తీసుకుంటున్నాం. కానీ మా రంగుల ప్రపంచంలో ఏమవుతుందో అని ఫోకస్ ఎక్కువ. థియేటర్ కి వచ్చే వాడికి నా సినిమా చూసే అర్హత ఉందా లేదా..? అని మేం కూడా మొదలుపెడితే ఎవడొస్తాడు థియేటర్ కి. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే.. థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి. మాకు అదే వర్క్' అంటూ చెప్పుకొచ్చారు.