Ammayi garu Serial Today Episode: విరూపాక్షి గన్‌లో నుంచి బుల్లెట్‌ ఎవరో దొంగలించి  ఆ బుల్లెట్‌తో  చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను చంపారని రాజు సీఎం సూర్యకు చెబుతాడు. అలాంటప్పుడు వాళ్ల వేలిముద్రలు అమ్మగారి గన్‌మీద ఉంటాయని అంటాడు. ఇదే విషయం పోలీసులకు చెబితే వాళ్లు ఫోరెన్సిక్‌ నిపుణులు పంపించారని రూప చెబుతుంది.ఈ మాటలు విని విజయాంబికాకు, దీపక్‌కు గుండె జారిపోతుంది. గన్‌మీద ఉన్న ఫింగర్‌ప్రింట్ మ్యాచింగ్ కోసం వాళ్లు వస్తున్నారన రాజు చెబుతాడు. ఇంతలోనే ఫోరెన్సిక్ టెస్ట్ చేసే  వాళ్లు వచ్చి ఎవరి వేలిముద్రలు తీసుకోవాలని అడుగుతారు. వెంటనే రూప మా అత్త,బావ వేలిముద్రలు తీసుకోవాలని చెబుతుంది. దీంతో వాళ్లిద్దరూ వేలిముద్రలు ఇస్తారు. కానీ అవి మ్యాచ్ అవ్వవు. దీంతో రూప,రాజు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అప్పుడు విజయాంబిక కలుగజేసుకుని ఇప్పటికైనా మేం నిర్దోషులమని నమ్ముతారా లేదా అని అంటుంది. మీకు ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే..చెప్పండి బయటకు వెళ్లిపోతాం కానీ....ఇలా అడ్డమైన కేసుల్లో ఇరికించాలని చూడకండని దీపక్ అంటాడు...         

Continues below advertisement

అప్పుడే ఫోరెన్సిక్ టెస్ట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ఓ విషయం చెబుతాడు. వీళ్లిద్దరి వేలిముద్రలు లేకపోయినప్పటికీ....గన్‌మీద ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు  మరొకరి వేలిముద్రలు ఉన్నాయన సీఎం సూర్యకు చెబుతాడు. కోర్టు టైం కల్లా ఆ నేరగాడు ఎవరో కనుక్కోకపోతే విరూపాక్షికి శిక్షపడుతుందని అందరూ బాధపడుతుంటారు. ఆ దొంగ ఎవరో నేను కనిపెడతానని రాజు అంటాడు.

జైలులోఉన్న విరూపాక్షిని చూసేందుకు సీఎం సూర్య అక్కడికి వస్తాడు. నువ్వు ఏమీ భయపడకు విరూపాక్షి...నువ్వు ఈ హత్య చేయలేదని నాకు తెలుసంటాడు. ఇంట్లో అందరికీ ఈవిషయం తెలుసు అంటాడు. సాక్ష్యాధారాలు  చూపించేసరికి చట్టానికి వ్యతిరేకంగా ఏ పనిచేయకూడదనే ఆరోజు పోలీసులకు అడ్డు చెప్పలేదంటాడు. నువ్వు ఏ తప్పు చేయాలేదని నాకు తెలుసు అంటాడు. నీకు ఏం కాదని చెప్పడానికే ఇక్కడికి వచ్చానంటాడు. నువ్వు నమ్మతే చాలు సూర్య అని విరూపాక్షి అంటుంది.

Continues below advertisement

కళ్లతో చూడకుండా ఓ మనిషి తప్పు చేశాడంటే  ఎలా నమ్ముతా అనుకుంటున్నావు అని సూర్య అనగానే....తాను ఇంటిలో నుంచి వెళ్లిపోయిన నాటిరోజులు విరూపాక్షికి గుర్తుకు వస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇప్పుడు నమ్మని వాడివి...మరి ఆరోజు  నీకళ్లతో చూడనివి ఎలా నమ్మావు అంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే  నేను తప్పు చేశానని ఆరోజు ఎలా నమ్మావు అని నిలదీస్తుంది. నీ మనసుకు ఆ రోజు ఎందుకు నేను తప్పు చేయలేదని అనిపించలేందంటుంది. ఇన్నేళ్లల్లో  తొలిసారి నా భర్త స్థానంలో నాకు ధైర్యం చెప్పడానికి వచ్చావు అది చాలు అంటుంది. నన్నుకలవడానికి వచ్చావు చాలా సంతోషంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఆరోజు నువ్వు ఇలాగే ఆలోచించి ఉంటే ఈపాతికేళ్లు మరోలా ఉండేవి అంటుంది. ఇన్నేళ్లలో నీ మనసుకు ఒక్కసారి కూడా రావాలి అనిపించలేదా అని నిలదీస్తుంది. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన వ్యక్తికి ఎలా ద్రోహం తలపెడతాను అనుకున్నావు అంటుంది విరూపాక్షి.  నీకోసం పాతికేళ్లు కాదు మరో పాతికేళ్లు అయినా ఓర్పు,సహనంతో ఎదురుచూస్తూనే ఉంటానని అంటుంది. నాకు ఇన్నేళ్లు  నువ్వు వేసిన శిక్ష కన్నా ఈ పోలీసు శిక్షలు పెద్దవి కాదని కన్నీళ్లు పెట్టుకుంటుంది.