Bheemla Nayak: 'భీమ్లా నాయక్' వచ్చేది ఎప్పుడు? అందరి కళ్లు పవన్ కల్యాణ్ సినిమా మీదే...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా మీదే ఉన్నాయి.

Continues below advertisement

ఎప్పుడు? 'భీమ్లా నాయక్' థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? అది వస్తే... తమ తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకు రావాలని చాలా మంది సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అండ్ 'భీమ్లా నాయక్' బృందం తీసుకోబోయే నిర్ణయం మీద కొన్ని సినిమాల విడుదల తేదీలు ఆధారపడి ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' అడ్డుపడకుండా ఉండి ఉంటే... సంక్రాంతికి 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. అదంతా గతం! దాన్ని పక్కన పెట్టేస్తే... ఇప్పుడు ఫిబ్రవరి 25కి 'భీమ్లా నాయక్' వస్తుందా? లేదా? అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. దీనికి కారణం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' (Aadavallu Meeku Joharlu) రిలీజ్ డేట్.

Continues below advertisement

సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకొన్న తర్వాత ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' (Bheemla Nayak)ను విడుదల చేస్తామని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అధినేత, చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన పవన్, రానా పోస్ట‌ర్‌లో కూడా అదే పేర్కొన్నారు. అయితే... శర్వానంద్, రష్మిక (Rashmika Mandanna) జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిర్మించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. పవన్ సినిమా వాయిదా పడింది కాబట్టే ఈ ప్రకటన వచ్చిందని కొందరు భావించారు. అయితే... అసలు మేటర్ అది కాదు.

'భీమ్లా నాయక్' (Bheemla Nayak on Feb 25th, 2022)ను వాయిదా వేయాలని నిర్మాతలు అనుకోలేదు. ప్రస్తుతానికి ఫిబ్రవరి 25నే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఏపీలో సెకండ్ షోకు, 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి అనుమతులు రాకపోతే అప్పుడు నిర్ణయం మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఫిబ్రవరి తొలి వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. 'భీమ్లా నాయక్' వాయిదా పడకపోతే... తమ సినిమాను తీసుకు రావాలని 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీమ్ అనుకుంటోంది. 'భీమ్లా నాయక్' వస్తే... ఫిబ్రవరి నెలాఖరు నుంచి వేసవికి వెళ్లాలని అనుకుంటోంది. అదీ సంగతి!

ఒక్క 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీమ్ మాత్రమే కాదు, మరికొన్ని చిన్న సినిమాలు కూడా 'భీమ్లా నాయక్' నిర్మాతల నుంచి మరోసారి క్లారిటీ కోరుకుంటున్నాయి. పవన్ సినిమా రాకపోతే మరికొన్ని చిన్న సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 'భీమ్లా నాయక్' వాయిదా పడితే... ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ (Varun Tej) 'గని' కూడా విడుదల కావచ్చని మరో టాక్. 
 

Continues below advertisement
Sponsored Links by Taboola