Ram Charans Wax Statue At The Madame Tussauds: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సింగపూర్ మ్యూజియంలో ప్రమఖులు విగ్రహాల సరసన చెర్రీ విగ్రహం చేరబోతోంది. తాజాగా టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చి రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. వచ్చే ఏడాది (2025) సమ్మర్ లోపు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  


చెర్రీకి 'మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు'


రీసెంట్ గా అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డుల ప్రకటనలో చెర్రీ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయనున్నట్లు టుస్సాడ్స్ ప్రతినిధులు ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా 'మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు'ను అందజేస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ లాంటి నటులకు తమ మ్యూజియంలో స్థానం కల్పించడం గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. “రామ్ చరణ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్లకు మా మ్యూజియంలో స్థానం కల్పించడం పట్ల మేం గర్వంగా ఫీలవుతున్నాం. భారతీయ సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఉండటం సంతోషకరం. ఆయన విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం వల్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరింత గుర్తింపు వస్తుందని భావిస్తున్నాం” అని తెలిపారు.   


గర్వంగా ఫీలవుతున్నా- రామ్ చరణ్


సింగపూర్‌ లోని మేడమ్ టుస్సాడ్స్‌ లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. “చిన్నప్పటి నుంచి మేడం టుస్సాడ్స్ లో ఎంతో మంది గొప్ప వ్యక్తులను చూశాను. నేనే ఏ రోజు కూడా వారి మధ్యలో తాను ఉంటానని అనుకోలేదు. కనీసం కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు వారి పక్కన స్థానం లభించడం గర్వంగా ఉంది. సినీ పరిశ్రమ కోసం తాను పడే కృషి, తపవనకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మేడం టుస్సాడ్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు” అని చెర్రీ చెప్పుకొచ్చారు. 


అప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2, ఇప్పుడు చెర్రీ!


అటు రామ్ చరణ్ మైనపు విగ్రహంలో ఆయన పెట్ డాగ్ రైమ్ కూడా ఉండబోతోంది. ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ 2 విగ్రహంలో మాత్రమే ఆమె పెంపుడు జంతువు ఉంటుంది. “రైమ్ నా జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు నాతో పాటు తను కూడా టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరడం సంతోషంగా ఉంది” అని రామ్ చరణ్ అన్నారు.



మేడం టుస్సాడ్స్ లో పలువురు సినీ ప్రముఖుల విగ్రహాలు


సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు భారతీయ నటీనటుల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. షారుఖ్ ఖాన్, కాజోల్, అమితాబ్ బచ్చన్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరి పక్కన రామ్ చరణ్ ప్లేస్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెర్రీకి శుభాకాంక్షలు చెప్తున్నారు.  


Read Also: మాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్?