Adipurush box office collection Day 2: ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోడే  రూ. 140 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. తాజాగా మరో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు రూ. 200 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజా వివరాల ప్రకారం.. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.240 కోట్లు వసూలు చేసింది.


ఎక్కడ చూసినా నెగెటివ్ రివ్యూలు, నిరసనలు, వివాదాస్పదంగా తీశారని కామెంట్లు, రామాయణంలా లేదని, రాముడిగా ప్రభాస్ సూట్ కాలేదని, హనుమంతుడి వేషధారణపై ట్రోల్స్, కృతి సనన్ డైలాగ్స్, రావణుడి క్యారెక్టర్ లో సైఫ్ అలీఖాన్.. ఇలా ఒక్కటేమిటి చాలా విషయాల్లో 'ఆదిపురుష్' సినిమాపై విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. మరికొంతమందైతే ఈ సినిమా రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉందని, తమ పిల్లలకు తప్పుడు రామాయణాన్ని నేర్పించాలని, చూపించాలని అనుకోవడం లేదని బుక్ చేసుకున్న టికెట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకులు చూసేందుకు సరికాదంటూ హిందూసేన ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడేనా... ఈ సినిమాకు ముందు నుంచీ ఏవో ఒక అడ్డంకులు, అవాంతరాలు, వివాదాలు.. పలుమార్లు వాయిదా పడ్డా అవన్నీ అధిగమించి.. ఎట్టకేలకు జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 


'ఆదిపురుష్' విడుదలైనప్పటి నుంచి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ పై చాలా విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలో సినిమా ప్రదర్శనపై జాతీయ స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శనను కనబరుస్తుండడం చెప్పుకోదగిన విషయం.






ఇన్ని అవాంతరాలు ఎదురైనా, ఎదురవుతున్నా.. అవేవీ సినిమా కలెక్షన్లను ఆపలేకపోతున్నాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ డేనే రూ.140కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ రెండో రోజున రూ. 65 కోట్లు రాబట్టింది. 'ఆదిపురుష్' హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. రెండు రోజుల్లో 37 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు గ్రాస్ రూ. 26 కోట్లకు చేరుకుంది. 


నాలుగో ప్లేస్ లోకి ఆదిపురుష్..


పంచవ్యాప్తంగా  బాక్సాఫీస్ వసూళ్ల పరంగా 'ఆదిపురుష్' తొలి రోజు వసూళ్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రూ. 222 కోట్లతో 'ఆర్‌ఆర్‌ఆర్(RRR), రూ. 214 కోట్లతో బాహుబలి 2: ది కన్‌క్లూజన్(Bahubali 2 : The Conclusion), రూ. 164.5 కోట్లతో 'కేజీఎఫ: చాప్టర్ 2(KGF :Chapter 2) లిస్ట్‌లో ఉన్న మొదటి మూడు సినిమాలు. 


'రామాయణం' ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రంలో సన్నీ సింగ్, దేవదత్తా నాగే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.


Read Also : జయసుధను పెళ్లి చేసుకోవాలనుందని ఆమె భర్తతోనే చెప్పాను: జేడీ చక్రవర్తి