సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.  నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నరేష్, పవిత్ర మధ్య ప్రేమయాణాన్ని 'మళ్ళీ పెళ్లి' పేరుతో వెండితెరపై చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నరేష్, పవిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.


కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాం ఆశీర్వదించండి!


'మళ్ళీ పెళ్లి'  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పవిత్ర లోకేష్ తన కొత్త జీవితం గురించి ప్రస్తావించింది. త్వరలోనే నూతన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నామని, అందరూ తమని ఆశీర్వదించాలని కోరింది. “ ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి  ఓ గోల్ ఉంటుంది. ఇలా ఉండాలి. అలా ఉండాలి. ఇది చేయాలి. అది చేయాలి అనుకుంటారు. ఎలా సంపాదించాలి? ఎలా పేరు తెచ్చుకోవాలి? అని ఆలోచిస్తారు. నాక్కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ కలలు నెరవేర్చుకోవడం కోసమే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాను.  ఇండస్ట్రీలో నా శక్తికి మించి కష్టపడి పని చేశాను. నాకు ఏం కావాలో వాటిని నెరవేర్చుకున్నాను. నా జీవితం ఎలా ఉండాలి అనుకున్నానో అలా నిర్మించుకున్నాను.  కొంత మంది నన్ను చెడుగా చిత్రీకరించే ప్రయత్నించారు. కొంత మేరకు వాళ్లు సక్సెస్ అయ్యారు కూడా. కానీ, ఇప్పుడు నాకు ఒక శక్తి అండగా ఉంది. అదే నరేష్ గారు. నా జీవితాన్ని మళ్లీ నిర్మించుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం కల్పించిన విజయ నిర్మల గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. త్వరలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అని పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చారు.


 


కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న నరేష్, పవిత్ర


గత కొంత కాలంగా నరేష్, పవిత్ర సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, ప్రస్తుతం పవిత్రా లోకేష్ తో డేటింగ్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది మాత్రం కేవలం డేటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నా వీరిద్దరు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.   






తెలుగు, కన్నడ భాషల్లో  ‘మళ్ళీ పెళ్లి’ విడుదల


ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.  ఈ సినిమాలో జయసుధ, శరత్‌ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు  సురేష్ బొబ్బిలి  స్వరాలు సమకూర్చగా, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.


Read Also: అంగరంగ వైభవంగా నిర్మాత దానయ్య కొడుకు పెళ్లి, హాజరైన తెలుగు సినీ దిగ్గజాలు!