అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్ని తన అంద, చందాలతో ఎంతో ఆకట్టుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో తో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు ఛానెల్స్ లో యాంకర్ గా షోలు చేసింది. యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో నటించింది. బుల్లితెరపై టాప్ యాంకర్ గా వెలుగు వెలిగిన అనసూయకు, వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన మెప్పించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో టీవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టింది.  


మా దేశంలో వయసు అనేది అవమానం - అనసూయ


తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వృద్ధులకు నిర్వహించిన రన్నింగ్ రేస్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. మన దగ్గర వయసు పెరగడం అవమానంగా భావిస్తారు ట్వీట్ చేసింది. “నా దేశంలో, నా రాష్ట్రంలో వయస్సు పెరగడం అనేది ప్రతి ఒక్కరికీ అవమానం” అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను వాలా అఫ్సర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో 100 ఏండ్ల వయసున్న వృద్ధులకు రన్నింగ్ రేస్ నిర్వహిస్తారు. 102 సంవత్సరాలున్న పండు ముసలి వ్యక్తి ఈ ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు, అనసూయ స్టేట్ మెంట్ పై అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ‘ఆంటీ’ అన్నందుకు ఫీలైనట్లుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.  






వరుస సినిమాలతో బిజీ బిజీ


కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరెక్కిన 'రంగమార్తాండ'లో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో అనసూయ కనిపించారు.  తాజాగా విడుదలైన ఈ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2', ‘అరి’, సహా పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ‘పుష్ష’ సినిమాలో కాత్యాయినిగా ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప2’లో మరింత అలరించనున్నట్లు తెలుస్తోంది.    


అనసూయ మనసులో ఏమీ దాచుకోదు!


వాస్తవానికి అనసూయ భరద్వాజ్ మనసులో ఏమీ దాచుకోదు. తన మనసుకు అనిపించిన విషయాలను బయటకు చెప్పేస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని సైలెంట్ గా ఉండే రకం కాదు తను. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులుకు ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు,  ఎవరైన తన గురించి పిచ్చి కామెంట్స్ చేస్తే, చీరి చింతకు కట్టేలా రిప్లై ఇస్తుంది. అందుకే ఆమెపై ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. ఆమె పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా, సినిమా రంగంలో మాత్రం మంచి స్వింగ్ లో కొనసాగుతోంది. 






Read Also: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?