Actor Satyadev appealed to give movie reviews on Sunday: సినిమా రంగంలో రివ్యూలపై ఎన్ని వివాదాలు వస్తున్నాయో చెప్పడం కష్టం. ఈ రివ్యూలు కొన్ని సినిమాల జయాపజయాల్ని ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయం ఉండటంతో ఎక్కువ మంది సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటుడు సత్యదేవ్ కూడా సినిమా రివ్యూలపై తనదైన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కాక ముందే అమెరికాలో షోలను చూసి రివ్యూలు రాసేస్తున్నారని.. అది ఇక్కడ ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. అందుకే సినిమా రివ్యూలు కాస్త ఆలస్యం కావాలని ఆయన అంటున్నారు. 


శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారం రివ్యూ ఇవ్వాలని ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో సత్యదేవ్ రివ్యూయర్లకు విజ్ఞప్తి చేశారు. సినిమాకు పని చేసిన యూనిట్ కు ఊపిరి తీసుకునే అవకాశం కల్పించాలని ఆయన అంటున్నారు. చాలా మంది ఇప్పుడు రివ్యూ చూసి సినిమాలకు వచ్చే వారు ఉన్నారని బ్యాడ్ రివ్యూ లేదా యావరేజ్ రివ్యూ వచ్చినా సినిమాలు చూసే వారు తగ్గిపోతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  సత్యదేవ్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన తాజాగా చేసిన విజ్ఞప్తితో క్లారిటీ వస్తోంది.              


డీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?


సినిమా రివ్యూలు  బాగా రాకపోయినా కొన్ని సినిమాలు హిట్ అవుతూంటాయి. సినిమా చాలా బాగుందని చెప్పినా కొన్ని సినిమాలకు కలెక్షన్లు రావు. ఇటీవల విడుదల సత్యం సుందరం సినిమాకు యూనానిమస్ గా రివ్యూయర్లు అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు.కానీ ఆ సినిమా కలెక్షన్లు తీసికట్టుగా ఉన్నాయి. అయితే ఈ వ్యూహాలు చిన్న సినిమాలేకే తీవ్ర నష్టం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పెద్ద సినిమాలకు కాస్త పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చేవారు.. చిన్న సినిమాల విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటున్నారని సత్యదేవ్ లాంటి నటులు మథనపడుతున్నారు. ఇంటర్యూల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.                                                        


ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్


రివ్యూలపై సినీ ఇండస్ట్రీలో కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. చాలా సార్లు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే రివ్యూ అనేది ఒకరి అభిప్రాయం అని.. సినిమా చూసిన వాళ్లు అలా వ్యక్తం చేయడంలో తప్పే లేదని రివ్యూయర్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు కానీ.. మిడినైట్ రివ్యూలు మాత్రం వస్తూనే ఉన్నాయి.