Jayam Ravi On Aarti’s Divorce Comments: తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న జయం రవి, ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ ప్రకటన పై ఆయన భార్య ఆర్తి తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు చెప్పకుండానే వన్ సైడ్ గా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్తి ఆరోపణలపై జయం రవి ఎట్టకేలకు స్పందించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు.  విడాకుల విషయం గురించి ఆర్తి కుటుంబ సభ్యులకు ముందే చెప్పానన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.    


ప్రకటనకు ముందే లీగల్ నోటీసులు  


ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేయడానికి ముందే లీగల్ నోటీసులు పంపించినట్లు జయం రవి వెల్లడించారు. “ నేను సెప్టెంబర్ 9న విడాకులు ప్రకటన చేశాను. ఈ ప్రకటనకు కొన్ని నెలల ముందే ఆర్తికి లీగల్ నోటీసులు పంపించాను. కానీ, ఆమె వాటికి స్పందించలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాను. వాస్తవానికి మా విడాకుల గురించి అప్పటికే ఊహాగానాలు వస్తున్నాయి. నా అభిమానులకు అసలు విషయం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే, అఫీషియల్ గా విడాకుల ప్రకటన చేశాను”అని చెప్పుకొచ్చారు. 


విడాకులు విషయం రెండు కుటుంబాలకు తెలుసు


తమ విడాకులకు సంబంధించిన ఆర్తితో పాటు ఇరు కుటుంబాలకు తెలుసన్నారు జయం రవి. “విడాకుల విషయాన్ని నేను  ఆర్తితో పాటు ఇరు కుటుంబాలకు ముందే చెప్పాను. ఈ విషయం గురించి ముందు ఆర్తితో మాట్లాడాను. తన ఫ్యామిలీతో చెప్పాలన్నది. నేను ఆర్తి తండ్రితో ఈ విషయం చెప్పాను. అలాంటప్పుడు ఏకపక్ష నిర్ణయం అనే మాటకు అర్థమే లేదు” అని జయం రవి వెల్లడించారు. 


విడాకులకు కారణం చెప్పలేను


విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని తాను బయటకు చెప్పలేనన్నారు జయం రవి. ఒకానొక సమయంలో తాను మానసిక క్షోభను అనుభవించినట్లు చెప్పారు. ఎందుకు అనేది మాత్రం వివరించలేనన్నారు.  ఇంట్లో నుంచి ఖాళీ చేతులతో బయటకు  వచ్చేశానన్నారు. తన కారు మాత్రమే తెచ్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు ఉండేందుకు ఇల్లుకూడా లేదని జయం రవి వెల్లడించారు.  ప్రస్తుతం తాను ముంబైలో ఉంటున్నట్లు చెప్పారు. చెన్నైకి వచ్చి వెళ్తున్నట్లు వివరించారు.  జూన్ లో తన కొడుకు ఆరవ్ బర్త్ డేలో తనతో గడిపానన్నారు. ప్రస్తుతం తాను పిల్లలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెద్ద కొడుకు ఆరవ్ కు 14 ఏండ్లు, చిన్నకొడుకు అయాన్ కు 8 ఏండ్లు ఉన్నాయన్నారు.  పెద్ద కొడుకు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా, చిన్నోడికి ఇంకా అంత మ్యెచూరిటీ రాలేదన్నారు. కష్ట పరిస్థితుల నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉందన్నారు.  గత ఏడాది ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న జయం రవి.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.


Read Also: జాన్వీ కపూర్ క్యూట్ తెలుగు స్పీచ్ - 'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఇలా...