Parvathipuram Constituency: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం పార్వతీపురం. జిల్లాలు విభజన తరువాత ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరుతో ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. 18వ ఎన్నికలకు నియోకజవర్గం సిద్ధం అవుతోంది. ఈ నియోజకవర్గంలో 1,93,314 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 94,236 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 99,039 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ, ఐదుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు. 


టీడీపీకి దక్కిన ఎక్కువ విజయాలు


పార్వతీపురం నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 17సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నిక 1952లో జరగ్గా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వీడీవీ దేవ్‌ తన సమీప ప్రత్యర్థి కేఎల్పీ నుంచి పోటీ చేసిన సీపీ నాయుడిపై 17,981 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వీసీ దేవ్‌ తన సమీప ప్రత్యర్థి కేఎల్పీ నుంచి పోటీ చేసిన సీపీ నాయుడిపై 23,981 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వీసీ దేవ్‌ వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కేఎల్‌పీ నుంచి పోటీ చేసిన సీపీ నాయుడిపై 1391 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో వీసీ దేవ్‌ నలుగోసారి ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పీఎల్‌ నాయుడిపై 7437 ఓట్ల తేడాతో విజయాన్న దక్కించుకున్నారు. 


1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సీపీ నాయుడుపై 6906 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సీపీ నాయుడి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడిపై 10,570 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన సీపీ నాయుడు విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన వి కృష్ణమూర్తి నాయుడుపై 14,283 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి పరశురామ్‌పై 9738 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు రెండోసారి విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి పరశురామ్‌పై 16,002 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 


1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా కృష్ణమూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎ శివున్నాయుడిపై 2689 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా కృష్ణమూర్తి మరోసారి విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం శివున్నాయుడుపై 9980 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా అన్నపూర్ణమ్మ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం శివున్నాయుడిపై 635 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం శివున్నాయుడు విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన డి ప్రతిమాదేవిపై 13,967 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ విజయరామరాజు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన డి జగదీశ్వరరావుపై 1796 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సవరపు జయమణి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులుపై 2718 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి బొబ్బిలి చిరంజీవులు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీచేసిన జెమ్మాన ప్రసన్నకుమార్‌పై 6929 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏ జోగారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులుపై 24,199 ఓట్ల తేడాతో గెలుపొందారు. రానున్న ఎన్నికలను ఇక్కడ విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు పోటీకి సిద్ధపడుతుండగా, వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు ప్రయత్నాలు సాగిస్తున్నారు.