Karimnagar Assembly Election Results 2023 constituencies wise winners and losers : కరీంనగర్ జిల్లాలో కూడా కారుకు ఎదురుగాలి తప్పడం లేదు. ఈ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండబోదని అంతా అనుకున్నారు కానీ... ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంది. 13 స్థానాల్లో పోటీ జరిగితే నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కరీంనగర్ జిల్లా(హుజూరాబాద్,మానకొండూరు,సిరిసిల్ల, వేములవాడ,చొప్పదండి,కరీంనగర్, మంథని, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల,రామగుండం )
హుజూరాబాద్ నియోజకవర్గం
హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా మార్పులు జరిగాయి. బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను 2014, 2018లో పోటీ చేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఆపై ఆయన బీజేపీలో చేరి పోటీ చేయడంతో 2021లో ఉపఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా ఈటల విజయం సాధించారు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెల్లుశ్రీనివాస్‌పై గెలిచారు. 2018 బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 104840 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. 2021లో ఉపఎన్నిక నాటికి కౌశిక్ రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు.
హుజూరాబాద్ నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023
2021 ఈటల రాజేందర్(బీజేపీ) గెల్లు శ్రీనివాస్(బీఆర్‌ఎస్)
2018 ఈటల రాజేందర్(బీఆర్‌ఎస్) పాడి కౌశిక్‌రెడ్డి(కాంగ్రెస్)
2014 ఈటల రాజేందర్(బీఆర్‌ఎస్) సుదర్శన్ రెడ్డి(కాంగ్రెస్)
మానకొండూరు నియోజకవర్గం
2023 మానుకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయ ...BRS అభ్యర్థి రసమయి బాలకృష్ణపై విజయం సాధించారు
మానకొండూరులో గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సంస్థ ఛైర్మన్ రసమయి బాలకిషన్ రెండు సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌పై 31509 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రసమయికి 88997 ఓట్లు వస్తే, మోహన్‌కు 57488 ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత మోహన్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో బాలకిషన్, మోహన్ మధ్యే పోటీ నెలకొంది. రసమయి చేతిలో 46922 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మానకొండూరు నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్) రసమయి బాలకృష్ణ (బీఆర్ఎస్)
2018 రసమయి బాలకిషన్(బీఆర్‌ఎస్) ఆరేపల్లి మోహన్(కాంగ్రెస్)
2014 సమయి బాలకిషన్(బీఆర్‌ఎస్) ఆరేపల్లి మోహన్(కాంగ్రెస్)
సిరిసిల్ల నియోజకవర్గం
సిరిసిల్లలో కేటీఆర్ విజయం కొనసాగుతోంది. 2023 లో వరుసగా ఐదోసారి గెలుపు సాధించారు కేటీఆర్.
2018 లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల ఆధిక్యంతో 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో 53004 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిరిసిల్ల నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 కేటీఆర్(బీఆర్‌ఎస్)
2018 కేటీఆర్(బీఆర్‌ఎస్) మహేందర్ రెడ్డి(కాంగ్రెస్)
2014 కేటీఆర్(బీఆర్‌ఎస్) రవీందర్‌రావు(కాంగ్రెస్)
వేములవాడ నియోజకవర్గం
2023 - కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ ..సమీప BRS ప్రత్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావుపై గెలుపొందారు
వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్ నాలుగోసారి విజయం సాధించారు. ఒకసారి టీడీపీ నుంచి, ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఆయన జర్మని పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదంతో ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చెన్నమనేని రమేష్‌పై కాంగ్రెస్ తరఫున ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు.
వేములవాడ నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 ఆది శ్రీనివాస్ ( కాంగ్రెస్) చల్మెడ లక్ష్మీ నరసింహారావు (BRS)
2018 చెన్నమనేని రమేష్(బీఆర్‌ఎస్) ఆదిశ్రీనివాస్(కాంగ్రెస్)
2014 చెన్నమనేని రమేష్(బీఆర్‌ఎస్) ఆదిశ్రీనివాస్(కాంగ్రెస్)
చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం
2018లో చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రవిశంకర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మేడిపల్లి సత్యంపై 42127ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ 2014లో టిఆర్‌ఎస్ పక్షాన బొడిగె శోభ పోటీ చేశారు. ఆమెకు 2018లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు. 2014లో కాంగ్రెస్ తరఫున దేవయ్య పోటీ చేశారు. ఆయనపై టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన బొడిగె శోభ 54981 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023
2018 రవిశంకర్ (బీఆర్‌ఎస్) మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)
2014 బొడిగె శోభ (బీఆర్‌ఎస్) దేవయ్య(కాంగ్రెస్)
కరీంనగర్ నియోజకవర్గం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ మూడుసార్లు నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై 14974 ఓట్ల ఆధిక్యతతో 2018లో విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. గంగుల కమలాకర్ 2009లో టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కారు ఎక్కి గెలుస్తూ మంత్రి పదవి పొందుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
విజయం ప్రత్యర్థి
2023
2018 గంగుల కమలాకర్ (బీఆర్‌ఎస్) బండి సంజయ్(బీజేపీ)
2014 గంగుల కమలాకర్ (బీఆర్‌ఎస్) బండి సంజయ్(బీజేపీ)
పెద్దపల్లి నియోజకవర్గం
2023- పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సీహెచ్.విజయరమణారావు ...BRS అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పై విజయం సాధించారు.
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లుగా బీఆర్‌ఎస్ తరఫున దాసరి మనోహర్ రెడ్డి గెలుస్తున్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుపై 8466 ఓట్లు తేడాతో గెలిచారు. విజయ రమణారావు 2009లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లుగా బీఆర్‌ఎస్ తరఫున దాసరి మనోహర్ రెడ్డి గెలుస్తున్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుపై 8466 ఓట్లు తేడాతో గెలిచారు. విజయ రమణారావు 2009లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
పెద్దపల్లి నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 సీహెచ్.విజయరమణారావు (కాంగ్రెస్) దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)
2018 దాసరి మనోహర్ రెడ్డి(బీఆర్‌ఎస్) విజయ రమణారావు(కాంగ్రెస్)
2014 దాసరి మనోహర్ రెడ్డి(బీఆర్‌ఎస్) విజయ రమణారావు(టీడీపీ)
మంథని నియోజకవర్గం
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంధని నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధింఛారు. 2023 లో BRS అభ్యర్థి పుట్ట మధుపై గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ నేతగా శ్రీధర్ బాబు ఉన్నారు. 2014లో మధు చేతిలో ఓడిపోయారు.
మంథని నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్) పుట్టా మధు(బీఆర్‌ఎస్)
2018 శ్రీధర్ బాబు(కాంగ్రెస్) పుట్టా మధు(బీఆర్‌ఎస్)
2014 పుట్టా మధు(బీఆర్‌ఎస్) శ్రీధర్ బాబు(కాంగ్రెస్)
రామగుండం నియోజకవర్గం
2023- రామగుండం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్...BRS అభ్యర్థి కోరుకంటి చందర్ పై విజయం సాధించారురామగుండం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కురుగంటి చందర్ విజయం సాధించారు. అప్పటి టిఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అంతకు ముందు సత్యనారాయణ రెండుసార్లు విజయం సాధించారు. 2018లో చందర్ బీఆర్‌ఎస్ రెబల్‌గా పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీపడి ఓడిపోయారు. ఆ తర్వాత చందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు.
రామగుండం నియోజకవర్గం
విజయం ప్రత్యర్థి
2023 మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ( కాంగ్రెస్) కోరుకంటి చందర్ ( బీఆర్ఎస్)
2018 కురుగంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) ఎస్ సత్యనారాయణ(బీఆర్‌ఎస్)
2014 సత్యనారాయణ(బీఆర్‌ఎస్)కురుగంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్)
ధర్మపురి (ఎస్సి) నియోజకవర్గం
2023 లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ BRS అభ్యర్థిపై గెలిచారు. 2009 నుంచి ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ విజయం సాధిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి గెలుస్తూనే ఉన్నారు. రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం ఆరుసార్లు గెలిచారు. 2014లో ఆయన మంత్రి అవుతారని అనుకున్నారుకాని ఛీప్ విప్ పదవి మాత్రమే దక్కింది. 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.లక్ష్మణకుమార్‌పై 441 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ధర్మపురి (ఎస్సి)
విజయం ప్రత్యర్థి
2023 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్) కొప్పుల ఈశ్వర్(బీఆర్‌ఎస్)
2018 కొప్పుల ఈశ్వర్(బీఆర్‌ఎస్) లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)
2014 కొప్పుల ఈశ్వర్(బీఆర్‌ఎస్) లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)
జగిత్యాల నియోజకవర్గం
జగిత్యాలలో తిరుగులేని టీ జీవన్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన అంతకు ముందు ఆరుసార్లు గెలిచారు. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఎమ్.సంజయ్ కుమార్ 61125 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాద జరిగిన గ్యాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు.
జగిత్యాల
విజయం ప్రత్యర్థి
2023
2018 ఎం.సంజయ్(బీఆర్‌ఎస్) టీ జీవన్ రెడ్డి(కాంగ్రెస్)
2014 టీ జీవన్ రెడ్డి(కాంగ్రెస్) ఎం.సంజయ్ (బీఆర్‌ఎస్)
కోరుట్ల
కోరుట్ల నియోజకవర్గం నుంచి 2023 లో BRS అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి కె.విద్యాసాగరరావు 2009 నుంచి ఒక ఉపఎన్నిక సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ నేత జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కోరుట్ల
విజయం ప్రత్యర్థి
2023 కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్)
2018 విద్యాసాగరరావు(బీఆర్‌ఎస్) నర్సింగరావు(కాంగ్రెస్)
2014 విద్యాసాగరరావు(బీఆర్‌ఎస్) నర్సింగరావు(కాంగ్రెస్)