Elections 2024 : కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు .. అవినాష్ రెడ్డి గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా కమలాపురం నియోజకవర్గంలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ప్రచారం నిర్వహించారు. న్యాయానికి - నేరానికి మద్య జరుగుతున్న పోరాటం కడప ఎన్నికలని స్పష్టం చేశారు.
పంచడానికి తన వద్ద డబ్బు లేదని.. YSR బిడ్డగా మీ ప్రేమ అభిమానం తన సొంతమన్నరు. రవీంద్రనాథ్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చినా నా కోసం తీసుకోండి.. నా మేనమామ నాకోసం ఇస్తాడు..ఎంత ఇచ్చినా తీసుకోండని సూచించారు. మేనమామ కి భాధ్యత ఉంటుంది కదా సెటైర్ వేశారు. రవీంద్రనాథ్ రెడ్డి కి ఓటు వేశారు ఒక్క పని అయినా చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. GNSS ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం అన్నారు..తట్టెడు మట్టి తియ్యలేదన్నారు. సర్వారాయ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదు. సర్వారాయ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఏమో కానీ... రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువు,రొయ్యల చెరువు కి నీళ్ళు వస్తున్నాయని మండిపడ్డారు.
ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించారు. అధికారం ఉన్నది మీ చెరువులు నింపుకోడానికా ? కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు. విశాఖ స్టీల్ ఎంత ముఖ్యమో...మనకు కడప స్టీల్ అంత ముఖ్యమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు అయినా వచ్చేవని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేశారు.. మొదటి 5 ఏళ్లు బాబు మోసం చేశారు ..బాబు చేసిన అభివృద్ధి ఏమి లేదని YSR వారసుడు జగన్ ను గెలిపిస్తే చేసింది ఏంటని ప్రశ్నించారు. YSR హయాంలో 54 ప్రాజెక్ట్ లు మొదలు పెట్టారు 2014 నాటికి 42 పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.. జగన్ YSR వారసుడు అయితే... జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు కట్టలేదని ప్రశఅనించారు.
YSR హయాంలో మెగా డీఎస్సీ వేశాడు..పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశాడు జగన్ 23 వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి దగా డీఎస్సీ చేశాడు.. 6 వేల ఉద్యోగాలకు దగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్తున్నాడు ..ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు భర్తీ కాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.35లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశాడుని ..అధికారం ఇస్తే శాఖల పరిధిలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల పరిధిలో 2.25లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
రాష్ట్రం అంతా మాఫీయా మయం అయిందని లిక్కర్ మాఫియా,డ్రగ్స్ మాఫీయా,గంజాయి మాఫీయా,ఇసుక మాఫియా,మట్టి మాఫీయా దోచుకుంటోందన్నారు. 10 ఏళ్లలో మన రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్ వివేకా జగన్ ను ఆయన కొడుకు అనుకున్నారు. సొంత కొడుకు లాంటి వాడి వాడు హంతకులను కాపాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. CBI దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. కాల్ రికార్డ్స్ ఉన్నాయి..హత్యకు ముందు డీల్ మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయి..ఇన్నీ ఆధారాలు ఉన్నా..నిందితుడు అవినాష్ రెడ్డి ని కాపాడుతున్నారన్నారు. CBI ను సైతం మేనేజ్ చేస్తున్నారు.. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదన్నారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా? నేరం వైపు నిలబడతారా ? ఆలోచన చేసి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు.