P Gannavaram Assembluy Constituency: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం పి గన్నవరం. ఈ నియోజకవర్గంలో తొలిసారి 1962లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు విజయం సాధించగా, ఐదుసార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,95,327 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 96,683 మంది కాగా, మహిళా ఓటర్లు 98,643 మంది ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు ఇవే
ఇప్పటి వరకు పి గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువసార్లు అండగా నిలబడ్డారు. తొలిసారి 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్ గణేశ్వరరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన బి నరసింహరావుపై 9590 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గడ్డం మహలక్ష్మి ఇక్కడ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎన్ గణపతిరావుపై 11,676 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గడ్డం మహలక్ష్మి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎన్ గణపతిరావుపై 2162 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్ గణపతిరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్ పేములుపై 14,504 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్ గణపతిరావుపై 17,765 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గడ్రం రామారావుపై 23,783 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్ గణపతిరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావుపై 4473 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్ గణపతిరావుపై 28,056 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బత్తుల వెంకటరావుపై 10,481 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన వేమ అయ్యాజీ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె కృష్ణమూర్తిపై 16,592 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి రాజేశ్వరీదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన అయ్యాజీ వేమపై 9281 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి రాజేశ్వరిదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తిపై 3105 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కొండేటి చిట్టిబాబుపై 13,505 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్ స్టాలిన్‌బాబుపై 22,207 ఓట్ల తేడాతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ ఇక్కడ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది.