Medak BRS candidate Venkatramireddy  :  రూ. వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద పిల్లల చదువులకు సాయం చేస్తానని తనను గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరుతున్నారు. వెంకట్రామిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.  కలెక్టర్ గా ఇక్కడే పని చేశానని, ఎంపిగా పోటీ చేస్తున్నానని, తన అదృష్టంగా భావిస్తున్నానని, కలెక్టర్ ఎంపిగా మీ ముందుకు వస్తున్నారని ఆశీర్వాదించాలని కోరారు. జీవితాంతం మీ సేవలో ఉంటానని, ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తున్నానని, ఫంక్షన్ హాల్లు నిర్మించి ఉచితంగా సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు.              

  


కాంగ్రెస్ తప్పుడు  హామీలు ఇచ్చింది                                


కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్ అని, ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలన్నారు.   బాండ్ పేపర్ ను చెల్ల ని కాగితంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఏద్దేవా చేశారు.రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ ప్రజలను మోసం చేశారన్నారు.                                  


దుబ్బాక ప్రజల్ని రఘునందన్ మోసం చేశారు                                


దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నాగలి, ఎడ్లు, నిరుద్యోగ భృతి అని మోసం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తున్నారని విమర్శించారు.దుబ్బాకలో 54 వేల ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారని, దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్ నియోజవర్గాల్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ప్రజలకు అధికారిగా ఉన్నానని, మరింత సేవ చేసేలా ఎంపిగా మీ ముందుకు వస్తున్నానని, ముగ్గురు అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని వెంకట్రామారెడ్డి కోరారు.                  


రాజపుష్ప సంస్థను నడుపుతున్న వెంకట్రామిరెడ్డి కుటుంబం                                                 


వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గా పని చేసినప్పటికీ ఆయన కుటుంబం బడా రియల్ ఎస్టేట్ వ్యాపార  సంస్థ  రాజపుష్పను నడుపుతున్నారు.  హైరైజ్ అపార్టుమెంట్లను ఈ సంస్థ నిర్మిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ క్రమంలో ఆయన సొంత డబ్బులు రూ. వంద కోట్లను పెట్టి ట్రస్టును ఏర్పాటు చేస్తానని అంటున్నారు.