తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించేంది. 114 మంది జాబితాను సెప్టెంబర్‌లోని విడుదల చేశారు కేసీఆర్. ఐదు సీట్లలో పోటీ తీవ్రంగా ఉన్నందున అక్కడ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేస్తూ వస్తున్నారు. మొదటి జాబితాలో ఉన్న అభ్యర్థులు జనాల్లోకి వెళ్లి తమ విజయం కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వారికి సపోర్ట్‌గా రాష్ట్ర నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. 


మొదటి జాబితాలో ఉన్న 114లో 51 మందికి కేసీఆర్ బీఫామ్‌లు అందజేశారు. బీఫామ్‌తోపాటు 40 లక్షల రూపాయల చెక్‌ను కూడా ఇస్తున్నారు. మంచి రోజులు ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఇవాళే సంతకాలు చేసిన బీఫామ్‌లను వారికి అందేజేశారు. తన తల్లి మృతి కారణంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున కేసీఆర్ కుమార్తె కవిత బీఫామ్ అందుకున్నారు. కేసీఆర్ తరఫున గంపగోవర్థన్ బీఫామ్ అందుకున్నారు. 
114 మంది అభ్యర్థుల్లో కొందర్ని మార్చే అవకాశం ఉందని ప్రచారం బీఫామ్ అందుకోని వారిని టెన్షన్ పెడుతోంది. నాలుగు నుంచి ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. , నిజమామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే బీఫామ్‌లు అందజేశారు.  మిగతవారికి రెండు రోజుల్లో ఇస్తామని చెబుతున్నారు. అయితే వారిలో కొందర్ని మార్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.