Government Employees Protest Against Minister Kottu Satyanarayana In Tadepalligudem: మంత్రి కొట్టు సత్యనారాయణకు (Kottu Satyanarayana) గురువారం చేదు అనుభవం ఎదురైంది. తాడేపల్లిగూడెంలో (Tadepalligudem) పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న సమయంలో ఉద్యోగులు ఆయనపై నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన టీడీపీ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తోన్న ఉద్యోగులను మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించింది. 'మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డారు. పోలీసుల సాయంతో మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. జగన్ రెడ్డి బయటకు రాకుండా, ఇంట్లో దాక్కుంటుంది ఇందుకే' అంటూ ట్వీట్ లో పేర్కొంది.







Also Read: Chandrababu Comments : జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకూ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు - జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న