అన్వేషించండి

Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!

Opinion Poll 2026: మూడు రోజుల్లో కేరళ, అస్సాంలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడు, బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభమవుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమ బెంగాల్: టీఎంసీ, బీజేపీ మధ్య స్వల్ప ఆధిక్యంతో హోరాహోరీ పోరు.
  • అస్సాం: బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం, తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం.
  • తమిళనాడు: అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించవచ్చు.
  • కేరళ: వామపక్ష, యూడీఎఫ్ కూటముల మధ్య స్వల్ప తేడాతో త్రిముఖ పోరు.

Opinion Poll 2026: ఏప్రిల్, మే నెలలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై దేశమంతా ఆసక్తిగా ఫోకస్ చేసింది. ఎవరు అధికారంలోకి వస్తున్నారు, ఎవరి ప్రభావం ఎంత అనే డిస్కషన్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలు క్రమంగా వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ మరోసారి అధికారంలోకి తీసుకురావాలని మమతా బెనర్జీ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఆమెను ఎలాగైనా అధికారంలో నుంచి దించి కాషాయపు జెండా ఎగరేయాలని బీజేపీ ప్రతి వ్యూహాలతో ప్రయత్నాలు చేస్తోంది.  కేరళలో యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అస్సాంలో కాంగ్రెస్ బీజేపీ ఢీ కొంటున్నాయి. అన్నింటి కంటే ఎక్కువ ఆసక్తిని కలిగించే ఎన్నికల తమిళనాడు అసెంబ్లీ పోరు. 

బెంగాల్‌ టైగర్ ఎవరు? సర్వేలో ఏం తేలింది?

292 సీట్లు ఉన్న పశ్చిమబెంగాల్‌లో మాట్రిజ్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ పోటీ అంచనాలు అందనంతగా ఉంది. తాజా సర్వేలో పార్టీలే షేక్ అయ్యే అభిప్రాయాలు ప్రజలు చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 43 శాతం ఓట్లతో 140 నుంచి 160 సీట్లను గెలుచుకోగలదు. ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ 41 శాతం ఓట్లతో 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలు 16 శాతం ఓట్లతో 8 నుంచి 16 సీట్లు గెలుచుకోగలవు. పశ్చిమ బెంగాల్‌లో 148 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ అభిప్రాయ సేకరణలో టీఎంసీకి 2 శాతం స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ ఈ తేడా చాలా తక్కువగా ఉండటంతో ఎన్నికల చిత్రం ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. 

అస్సాంలో బీజేపీ క్లీన్ స్వీప్‌

మాట్రిజ్, చాణక్య నిర్వహించి ఒక సర్వే ప్రకారం అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పటిష్టమైన స్థితిలో ఉంటుంది. తిరిగి అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మ్యాట్రిక్స్ ప్రకారం బీజేపీ కూటమి 46 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌ కూటమికి 36 శాతం ఓట్లు వస్తాయి. ఇతరులు 18 శాతం ఓట్లు వస్తాయి. 126 అసెంబ్లీ సీట్లు ఉన్న అస్సాంలో బీజేపీ కూటమికి 92 నుంచి 102 సీట్లు, కాంగ్రెస్‌ కూటమికి 22 నుంచి 32 సీట్లు, ఇతరులకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

చాణక్య సర్వే ప్రకారం అస్సాంలో బీజేపీ 83 నుంచి 90 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 30 నుంచి 36 సీట్లు, ఇతరులు నాలుగు నుంచి ఏడు సీట్లలో గెలుచుకోగలరని చెబుతోంది.  

తమిళనాడులో ప్రకాశించేది ఎవరు?

ఇండియా టీవీ ప్రసారమైన మ్యాట్రిజ్ అభిప్రాయం ప్రకారం, ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ అభిప్రాయ సేకరణ ప్రకారం, స్టాలిన్ పార్టీ అయిన డీఎంకే ఎన్నికల్లో 102 నుంచి 115 సీట్లు గెలుచుకోగలదు. బీజేపీ, ఏఐడీఎంకే కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి 107 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. విజయ్‌ అధ్యక్షత వహించిన టీవీకే ఐదు నుంచి 12 సీట్లు మాత్రమే గెలుచుకోగలదు. ఇతరులు 1 నుంచి ఆరు సీట్లు గెలుచుకుంటారని అంచనాలు చెబుతున్నాయి. 

కేరళలో త్రిముఖ పోరు !

ఇండియా టీవీలో ప్రసారమైన మ్యాట్రిజ్ అభిప్రాయ సేకరణ ప్రకారం, కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి 62 నుంచి 68 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి 67 నుంచి 73 సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. 15 శాతం ఓట్లతో ఉన్న బీజేపీ 5 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇతరులు మూడు సీట్లలో విజయం సాధిస్తారని భావిస్తున్నారు. 

Frequently Asked Questions

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మరియు బీజేపీ మధ్య సీట్ల అంచనా ఎంత?

పశ్చిమబెంగాల్‌లో, టీఎంసీ 140-160 సీట్లు, బీజేపీ 130-150 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. అధికారంలోకి రావడానికి 148 సీట్లు అవసరం.

అస్సాంలో బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి?

మాట్రిజ్ సర్వే ప్రకారం, అస్సాంలో బీజేపీ కూటమి 92-102 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. చాణక్య సర్వే 83-90 సీట్లు అని చెబుతోంది.

తమిళనాడు ఎన్నికల్లో ఏ కూటమికి విజయావకాశాలున్నాయని అభిప్రాయ సేకరణ చెబుతోంది?

తమిళనాడులో, అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 107-120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. డీఎంకే 102-115 సీట్లు గెలుచుకోవచ్చు.

కేరళలో ఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా?

కేరళలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి 67-73 సీట్లు, అధికార వామపక్ష కూటమి 62-68 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget