Telangana Rythu Bharosa Politcs : తొమ్మిదో తేదీ లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే నగదు జమ చేయాలని తాజా ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రకటన పూర్తిగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేదిలా ఉందని వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది. రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం నిలిపివేయాలని 13వ తేదీ తర్వాతనే జమ చేయాలని సూచించింది.
ఇప్పటికే మెజార్టీ రైతులకు నిధుల జమ
ఈసీ అనుమతి ఇచ్చిన వెంటనే.. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోజమ చేయడం ప్రారంభించింది. అంతకు ముందే ఐదెకరాలలోపు రైతులకే నిధులు విడుదల చేశారు. ఐదెకరాలకు పైగా ఉన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు సోమవారం జమ చేశారు. ఈ మేరకు రైతుల ఫోన్లకు మెసే జ్‌లు కూడా వచ్చాయి. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసు కున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్‌లోనూ అంతేమంది రైతులకు సొమ్ము విడుదల చేస్తా మని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. కాగా ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు రూ.5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు జమ చేశారు.
ఆలస్యంగా ఈసీ ఉత్తర్వులు !
అయితే కొంత మందికి ఇంకా చెల్లించాల్సి ఉండటంతో తొమ్మిదో తేదీ లోపు అందరికీ నిధులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పారు. కానీ చెప్పడం కోడ్ ఉల్లంఘన కావడంతో బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఆపేయాలన్న ఉత్తర్వులు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే ఆగిన రైతు బంధు
కాంగ్రెస్ హయాంలో రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ అంశం కీలకంగా మారింది. అప్పట్లో పోలింగ్ ముందు ఈసీ నిధులు జమ చేయడానికి అవకాశం ఇచ్చింది. హరీష్ రావు పోలింగ్ ముందు రోజు తెల్లవారే సరికి మీ ఖాతాలకు టింగ్ అని మెసెజులు వస్తాయని చెప్పారు. హరీష్ రావు చేసిన ప్రకటనపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నిధుల విడుదల ఆపేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ అప్పట్లో రైతు బంధుకు ఇవ్వాల్సిన నిధులు ఖజానాలో లేకపోవడంతో రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేయలేకపోయారు. ఐదు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ుంది. ఇప్పుడు మరోసారి ఈసీ బ్రేక్ వేసింది.